Telugu Global
National

ఒమెక్రాన్ ఎందుకంత డేంజర్? మనమేం చేయాలి?

కరోనా వైరస్‌కి రకరకాల వేరియంట్లు రావడం సహజమే. కానీ ఈ ఒమెక్రాన్ కు ఎందుకు అందరూ భయపడుతున్నారు. అసలీ ఒమెక్రాన్ సంగతేంటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమెక్రాన్ వేరియంట్ ను ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’ గా ప్రకటించింది. అంటే మొదట్లో కరోనా వచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నామో ఇప్పుడు ఈ వేరియంట్ విషయంలో కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని అర్థం. కన్సర్న్ అంటే.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా, ఎక్కువమందిని ప్రాణాపాయానికి గురిచేసే […]

ఒమెక్రాన్ ఎందుకంత డేంజర్? మనమేం చేయాలి?
X

కరోనా వైరస్‌కి రకరకాల వేరియంట్లు రావడం సహజమే. కానీ ఈ ఒమెక్రాన్ కు ఎందుకు అందరూ భయపడుతున్నారు. అసలీ ఒమెక్రాన్ సంగతేంటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమెక్రాన్ వేరియంట్ ను ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’ గా ప్రకటించింది. అంటే మొదట్లో కరోనా వచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నామో ఇప్పుడు ఈ వేరియంట్ విషయంలో కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని అర్థం.

కన్సర్న్ అంటే..
ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా, ఎక్కువమందిని ప్రాణాపాయానికి గురిచేసే అవకాశం ఉన్నా, యాంటీబాడీలను ఎదుర్కొని శరీరంపై దాడి చేయగలిగిన సామర్ధ్యం ఉన్నా.. ఈ మూడింటిలో ఏది ఉన్నా దాన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’ అని అంటారు. అయితే ఈ వేరియంట్ మూడు లక్షణాల్లో ముందుండే అవకాశం కనిపిస్తుండడంతో దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా నిర్థారించారు.

భయపెడుతోంది
రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ ఈ వేరియంట్ సోకి కలవరం సృష్టిస్తోంది. అందుకే దీన్ని తేలికగా తీసుకోవద్దంటున్నాయి పలు దేశాలు. ఈ వేరియంట్‌ ప్రస్తుతం సౌత్‌ ఆఫ్రికాలో విస్తృతంగా ఉంది. ఇది వేగంగా ప్రపంచ దేశాలన్నీ విస్తరిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఈ వైరస్‌ విషయంలో అప్రమత్తంగానూ ఉండాలని పిలుపునిచ్చారు.

ఎందుకంత డేంజర్
వైరస్‌లో కొత్తకొత్త మ్యుటేషన్స్ జరిగినప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. అయితే కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా మ్యుటేషన్స్ జరిగిన వేరియంట్‌గా ఒమెక్రాన్ రికార్డుకెక్కింది. సుమారు50కి పైగా కొత్త మ్యుటేషన్లను శాస్త్రవేత్తలు ఈ వేరియంట్లో గుర్తించారు. ఎన్ని ఎక్కువ మ్యుటేషన్లు జరిగితే వైరస్ రూపం అంతగా మారిపోతూ ఉంటుంది. తద్వారా వ్యాక్సిన్ కు దాన్ని కనిపెట్టడం కష్టమవుతుంది.

ఇది అసలు డేంజర్.
ఈ వేరియంట్ లో జరిగిన మ్యుటేషన్ల కారణంగా ఈ వైరస్‌కి యాంటీబాడీస్‌ను బైపాస్‌ చేసుకునే లక్షణం వస్తుందనేది శాస్త్రవేత్తల భయపడుతున్నారు. అంతేకాకుండా ఈ వైరస్‌ మన శరీర కణాలలోకి అన్ని వేరియంట్ల కంటే వేగంగా చొచ్చుకుపోయే సామర్ధ్యం కలిగి ఉందని చెప్తున్నారు.

ప్రభుత్వమేం చేస్తోంది
ఒమెక్రాన్ మనదేశానికి కూడా చేరితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బూస్టర్ డోసు గురించి, పిల్లలకు వ్యాక్సిన్ గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొదటి డోసు పూర్తయి రెండో డోసు వేసుకోవాల్సినవారికి సమయానికి డోసు అందేలా చూడాల్సి ఉంది.

మనమేం చేయాలి
ప్రస్తుతం ఈ వైరస్ మనదేశం వరకూ చేరుకోలేదు. ఒకవేళ వచ్చినా మనం ఇప్పటి వరకు పాటిస్తూ వచ్చిన కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. ప్రస్తుతానికి దీని గురించి మనం భయపడాల్సిందేమీ లేకపోయినా కాస్త అప్రమత్తంగా ఉండడం మాత్రం అవసరం.

First Published:  30 Nov 2021 5:55 AM GMT
Next Story