సెంటిమెంట్ తిరగరాసిన వెంకీ
రీమేక్స్ తో హిట్ కొట్టిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ సీక్వెల్స్ తో హిట్ కొట్టినోళ్లు చాలా తక్కువ మంది. మరీ ముఖ్యంగా సీక్వెల్ తీస్తే సినిమా ఆడదనే నెగెటివ్ సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. దీనికి బలం చేకూరుస్తూ చాలా సినిమాలు ఉదాహరణలుగా నిలిచాయి కూడా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య ఓ రీమేక్ సీక్వెల్ తో హిట్ కొట్టాడు వెంకటేష్. అదే దృశ్యం-2 గతంలో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చేశారు. కానీ దానికి […]
రీమేక్స్ తో హిట్ కొట్టిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ సీక్వెల్స్ తో హిట్ కొట్టినోళ్లు చాలా తక్కువ మంది. మరీ ముఖ్యంగా సీక్వెల్ తీస్తే సినిమా ఆడదనే నెగెటివ్ సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. దీనికి బలం చేకూరుస్తూ చాలా సినిమాలు ఉదాహరణలుగా నిలిచాయి కూడా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య ఓ రీమేక్ సీక్వెల్ తో హిట్ కొట్టాడు వెంకటేష్. అదే దృశ్యం-2
గతంలో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చేశారు. కానీ దానికి సీక్వెల్ గా చేసిన శంకర్ దాదా జిందాబాద్ ఫ్లాప్ అయింది. ఇక డైరక్ట్ సీక్వెల్స్ చూసుకుంటే, ఆర్య హిట్టయింది, ఆర్య-2 మాత్రం ఫ్లాప్ అయింది. ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్ ను వెంకీ బ్రేక్ చేశాడు. దృశ్యం-2తో పెద్ద హిట్ అందుకున్నాడు.
ఈ ఒక్క సినిమాతో తెలుగులో తమ సబ్ స్క్రైబర్స్ బేస్ బ్రహ్మాండంగా పెరిగినట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. త్వరలోనే మరిన్ని సినిమాల్ని డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద స్ట్రీమింగ్ కు పెడతామని ప్రకటించింది. దృశ్యం-2తో పాటు వి, టక్ జగదీశ్ లాంటి సినిమాల్ని నేరుగా రిలీజ్ చేసిన అమెజాన్.. రాబోయే రోజుల్లో మరింతమంది పెద్ద హీరోల సినిమాలపై దృష్టిపెడుతోంది.