సమంత ఇంటర్నేషనల్ సినిమా
సౌత్ సినిమా గోల్డెన్ గర్ల్ సమంత ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సమంత గ్లోబల్ ఎంట్రీ గురించి అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే గ్లోబల్ సినిమాలో ఫీమేల్ లీడ్‌గా నటించనుంది సమంత. తిమెరి మురారి రాసిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అది. ఈ సినిమాతో వరల్డ్ స్క్రీన్ మీద మన ఫ్యామిలీమేన్2 గర్ల్ సత్తా చాటడం ఖాయం అంటున్నారు మేకర్స్. బాఫ్టా అవార్డు పొందిన డైరక్టర్ […]
సౌత్ సినిమా గోల్డెన్ గర్ల్ సమంత ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సమంత గ్లోబల్ ఎంట్రీ గురించి అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే గ్లోబల్ సినిమాలో ఫీమేల్ లీడ్‌గా నటించనుంది సమంత. తిమెరి మురారి రాసిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అది. ఈ సినిమాతో వరల్డ్ స్క్రీన్ మీద మన ఫ్యామిలీమేన్2 గర్ల్ సత్తా చాటడం ఖాయం అంటున్నారు మేకర్స్.
బాఫ్టా అవార్డు పొందిన డైరక్టర్ ఫిలిప్ జాన్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఆయన డైరక్ట్ చేసిన డౌన్‌టౌన్ అబ్బేకి క్రిటిక్స్ నుంచి ఎన్ని గొప్ప గొప్ప కాంప్లిమెంట్స్ అందాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ను గురు ఫిల్మ్స్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఈమె గతంలో సమంతతో ఓ బేబీ తీసిన నిర్మాత.
అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ను దర్శకుడు ఫిలిప్ జాన్ స్వయంగా రాసుకున్నారు. నిమ్మి హరస్గమ కో రైటర్‌గా పనిచేశారు. ఈ ఇంటర్నేషనల్ సినిమాలో ఉభయ లింగ సంపర్కురాలి పాత్రలో (బై-సెక్యువల్) కనిపించబోతోందట సమంత.