Telugu Global
National

విమానాల్లో ఇంటర్నెట్.. ఇండియాకు లాస్ట్ ప్లేస్..

విమాన ప్రయాణాల్లో సెల్ ఫోన్ వినియోగంపై ఆంక్షలుంటాయి. అయితే సిగ్నల్స్ ఉండవు కాబట్టి.. అత్యవసర సమయాల్లో మెయిల్స్ పంపించుకోవడం, మెసేజ్ లు ఇవ్వడం వంటివి కూడా ఎవరూ చేయలేరు. ప్రయాణాల్లో కూడా సమయం వృథా కాకూడదనుకునేవారి కోసం విమానంలోనే వైఫై సౌకర్యం కూడా అందుబాటులోకి తెస్తున్నాయి కొన్ని సంస్థలు. వాయిస్ కాల్స్ పై నిషేధం ఉన్నా.. ఇంటర్నెట్ వినియోగాన్ని అనుమతిస్తున్నాయి. అయితే ఇలా విమానాల్లో వైఫై సేవల విషయంలో భారత్ చివరి స్థానంలో ఉండటం విశేషం. సెల్ […]

విమానాల్లో ఇంటర్నెట్.. ఇండియాకు లాస్ట్ ప్లేస్..
X

విమాన ప్రయాణాల్లో సెల్ ఫోన్ వినియోగంపై ఆంక్షలుంటాయి. అయితే సిగ్నల్స్ ఉండవు కాబట్టి.. అత్యవసర సమయాల్లో మెయిల్స్ పంపించుకోవడం, మెసేజ్ లు ఇవ్వడం వంటివి కూడా ఎవరూ చేయలేరు. ప్రయాణాల్లో కూడా సమయం వృథా కాకూడదనుకునేవారి కోసం విమానంలోనే వైఫై సౌకర్యం కూడా అందుబాటులోకి తెస్తున్నాయి కొన్ని సంస్థలు. వాయిస్ కాల్స్ పై నిషేధం ఉన్నా.. ఇంటర్నెట్ వినియోగాన్ని అనుమతిస్తున్నాయి. అయితే ఇలా విమానాల్లో వైఫై సేవల విషయంలో భారత్ చివరి స్థానంలో ఉండటం విశేషం.

సెల్ ఫోన్ల వినియోగంలో భారత్ దూసుకుపోతోంది. అదే సమయంలో డేటా వినియోగంలో కూడా భారత్, ప్రపంచంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలుస్తుంది. అలాంటి భారత్ లో విమానాల్లో వైఫై లేదంటే విచిత్రమే. అవును, ఇతర దేశాల విమాన సర్వీసులతో పోల్చి చూస్తే.. భారతీయ విమానయాన సంస్థలు ఈ సేవల్లో చివరి స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో అసలు వైఫై సౌకర్యమే లేదు.

మూడేళ్ల క్రితమే అనుమతులు..
విమానాల్లో వైఫై సౌకర్యం కల్పించేందుకు టెలికం డిపార్ట్ మెంట్ మూడేళ్ల క్రితమే అనుమతులిచ్చినా దేశీయ విమానయాన సర్వీసుల్లో అదింకా పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్, ఎమిరేట్స్ వంటి విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వైఫై సౌకర్యం అందిస్తుంటే.. భారత్ కు చెందిన విమానయాన సంస్థలు మాత్రం ఆ విషయంలో ముందడుగు వేయలేదు.

అత్యంత ఖరీదైన వ్యవహారం..
విమానాల్లో వైఫై సౌకర్యం ఉండాలంటే యాంటెనా ఖర్చు 3 కోట్లనుంచి 4 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దాన్ని విమానంలో కొత్తగా అమర్చడం కూడా కష్టమైన వ్యవహారం. 12 గంటలు శ్రమపడితే కానీ విమానంలో వైఫై ఎక్విప్ మెంట్ ని అమర్చలేరు. దేశీయంగా చౌక ధరలకు టికెట్లు అందిస్తున్న విమాన సంస్థలకు ఈ పెట్టుబడి అనవసరంగా కనిపిస్తోంది. అందుకే భారత్ లో విమాన ప్రయాణికులకు ఇంకా వైఫై సౌకర్యం అందుబాటులోకి రాలేదు. కొత్తగా వచ్చే విమానాలన్నిట్లో వైఫై పరికరాలు ముందుగానే అమర్చి ఉంచుతున్నారు. ప్రస్తుతం భారత్ లో విస్తారా ఎయిర్ లైన్స్ మాత్రమే 2020 సెప్టెంబర్ నుంచి విమానాల్లో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

First Published:  29 Nov 2021 4:46 AM IST
Next Story