అఖండ తర్వాత రూటు మారుస్తాడట
అఖండ తర్వాత కచ్చితంగా తన స్టోరీ సెలక్షన్, పాత్రల ఎంపిక మారుతుందంటున్నాడు సీనియర్ నటుడు శ్రీకాంత్. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాలో విలన్ పాత్ర పోషించిన శ్రీకాంత్.. ఆ పాత్ర తనను ఎలా వరించిందనే విషయాన్ని పూసగుచ్చినట్టు వెల్లడించాడు. “కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే […]
అఖండ తర్వాత కచ్చితంగా తన స్టోరీ సెలక్షన్, పాత్రల ఎంపిక మారుతుందంటున్నాడు సీనియర్ నటుడు శ్రీకాంత్. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాలో విలన్ పాత్ర పోషించిన శ్రీకాంత్.. ఆ పాత్ర తనను ఎలా వరించిందనే విషయాన్ని పూసగుచ్చినట్టు వెల్లడించాడు.
“కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే బోయపాటి గారు అన్నారు. సరైనోడు సినిమాలో మంచి సాఫ్ట్ కారెక్టర్ ఇచ్చారు. మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా అని అన్నాను. అలా కొన్ని రోజులు ఎదురుచూశాను. అలా ఓ సారి బాలయ్య బాబు అఖండ కోసం విలన్ కారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసేసరికి నేనేనా? అనుకున్నాను. అంతలా మార్చేశారు నన్ను.”
అఖండ తర్వాత తన కెరీర్ మారిపోతుందంటున్న శ్రీకాంత్.. బాలయ్యతో ఎప్పుడు నటించినా చాలా కంఫర్ట్ గా ఉంటుందన్నాడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి శ్రీరామరాజ్యం అనే సినిమా చేశారు.