ఆచార్య టీజర్.. సిద్ధ అదరగొట్టాడు
ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్ కు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు, ఓ సాంగ్ కూడా రిలీజైంది. ఇప్పుడీ పాత్రకు సంబంధించిన లక్షణాలతో టీజర్ రిలీజ్ చేశారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ షేడ్ లో సాఫ్ట్ గా, మరో షేడ్ లో రఫ్ గా కనిపించబోతున్నాడనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా […]
ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్ కు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు, ఓ సాంగ్ కూడా రిలీజైంది. ఇప్పుడీ పాత్రకు సంబంధించిన లక్షణాలతో టీజర్ రిలీజ్ చేశారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ షేడ్ లో సాఫ్ట్ గా, మరో షేడ్ లో రఫ్ గా కనిపించబోతున్నాడనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా నుంచి రామ్‌చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. ఈ టీజర్‌లో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘ధర్మస్థలికి ఆపద వస్తే… ఆ అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది.
టీజర్ కు మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఇక చివర్లో చిరు కూడా కనిపించి టీజర్ కు ఓ నిండుదనం తీసుకొచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించాడు.