రాధేశ్యామ్.. దేశంలో ఇదే తొలిసారి
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది. గుండె ఒక్కటే అయినా.. రెండు చప్పుళ్ళు ఉంటాయంటూ రాధేశ్యామ్ యూనిట్ ఓ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. One […]
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది. గుండె ఒక్కటే అయినా.. రెండు చప్పుళ్ళు ఉంటాయంటూ రాధేశ్యామ్ యూనిట్ ఓ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
One Heart.. Two HeartBeats.. అంటే ఒకే సినిమానే అయినా కూడా రెండు భాషలకు కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన సంగీతం అందించబోతున్నారని దీని అర్థం. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో 29 నవంబర్ సాయంత్రం 7 గంలకు, రాధేశ్యామ్ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ నగుమోము తారలే టీజర్ ను విడుదల చేయడానికి రంగం సిధ్ధం అయింది. అదే రోజు మధ్యాహ్నం హిందీ వెర్షన్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు పాటలు డిఫరెంట్ గా ఉండబోతున్నాయి.
చాలా సంవత్సరాల తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్”. ఈ సినిమాలో రెబల్‌స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నారు. ఇది గొప్ప ప్రేమకథ అని మెషన్ పోస్టర్‌తోనే రివీల్ అయ్యింది. మొన్న విడుదలైన విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్.. ఈ రాతలే పాటకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రాతలే పాటకు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాసింది ఈ పాట. అలాగే ఈ పాటలో పంచభూతాలను కలిపి చూపించారు. ఇప్పుడు సెకెండ్ సాంగ్ ను రెడీ చేస్తున్నారు. జనవరి 14న సినిమా థియేటర్లలోకి వస్తోంది.