Telugu Global
National

భారత్ లో ఒమిక్రాన్ అలర్ట్.. వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు..

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ విషయంలో భారత్ కూడా ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. కొవిడ్ కేసులు తగ్గుతున్నవేళ అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు రద్దు చేయాలని భావించిన కేంద్రం.. దానిపై పునరాలోచించబోతోంది. దక్షిణాఫ్రికా సహా మరికొన్ని దేశాలనుంచి వచ్చేవారిపై పూర్తి నిఘా పెట్టింది. వారికి క్వారంటైన్ ని తప్పనిసరి చేసింది. ఇక భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారి విషయంలో కూడా అత్యవసరమైతేనే ప్రయాణాలు మొదలు పెట్టాలని సూచించింది. దీంతో అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో […]

భారత్ లో ఒమిక్రాన్ అలర్ట్.. వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు..
X

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ విషయంలో భారత్ కూడా ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. కొవిడ్ కేసులు తగ్గుతున్నవేళ అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు రద్దు చేయాలని భావించిన కేంద్రం.. దానిపై పునరాలోచించబోతోంది. దక్షిణాఫ్రికా సహా మరికొన్ని దేశాలనుంచి వచ్చేవారిపై పూర్తి నిఘా పెట్టింది. వారికి క్వారంటైన్ ని తప్పనిసరి చేసింది. ఇక భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారి విషయంలో కూడా అత్యవసరమైతేనే ప్రయాణాలు మొదలు పెట్టాలని సూచించింది. దీంతో అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ఉన్నట్టుండి కుదుపు ఏర్పడింది. దాదాపుగా 30శాతం మంది ప్రయాణికులు వాయిదావైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌ వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించింది.

కర్నాటక, మహారాష్ట్ర అప్రమత్తం..
దక్షిణాఫ్రికానుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కొవిడ్ పాజిటివ్ నిర్థారణ కాగా.. వారికి వచ్చింది కొత్త వేరియంట్ కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఇక విదేశాలనుంచి వచ్చినవారికి క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కర్నాటక ఆంక్షలు విధించింది. అటు మహారాష్ట్ర కూడా ఇతర ప్రాంతాలనుంచి తమ రాష్ట్రంలోకి వచ్చేవారికి రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అంటూ నిబంధనలు విధించింది. గతంలో ఇలాంటి ఆంక్షలున్నా.. ఇటీవల కొవిడ్ కేసులు తగ్గడంతో వాటిని సరవరించారు. తాజాగా ఒమిక్రాన్ అలర్ట్ తో మళ్లీ పాత ఆంక్షలను తెరపైకి తెచ్చారు.

ఇతర రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు..
ఒమిక్రాన్ అలర్ట్ తో థర్డ్ వేవ్ మొదలైనట్టేననే భయాందోళనలు అలముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నాయి. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచడంతోపాటు.. ప్రజలంతా మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. లాక్ డౌన్ తరహా ఆంక్షలపై ఎలాంటి ప్రకటనలు విడుదల కాకపోయినా.. భవిష్యత్తులో ఆ ముప్పు తప్పేలా లేదనే అంచనాలున్నాయి. అయితే ఈ దఫా కేంద్ర ప్రభుత్వం సూచనలకంటే ముుందే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటుండటం విశేషం.

First Published:  28 Nov 2021 5:46 AM IST
Next Story