వాలి సినిమా రీమేక్ కు లైన్ క్లియర్
తమిళ్ సెన్సేషనల్ స్టార్ అజిత్ కవల హీరోలుగా, తమిళ్ హీరో కమ్ దర్శకుడు యస్ జె సూర్య డైరక్ట్ చేసిన తొలి చిత్రం ‘వాలి’. తెలుగు తమిళ్ భాషలలో 1999 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు ఇతర ఇండియన్ లాంగ్వేజ్ లలో రీమేక్ కాలేదు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో డబ్బింగ్ చిత్రంగా విడుదల అయ్యింది. […]
తమిళ్ సెన్సేషనల్ స్టార్ అజిత్ కవల హీరోలుగా, తమిళ్ హీరో కమ్ దర్శకుడు యస్ జె సూర్య డైరక్ట్ చేసిన తొలి చిత్రం ‘వాలి’. తెలుగు తమిళ్ భాషలలో 1999 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు ఇతర ఇండియన్ లాంగ్వేజ్ లలో రీమేక్ కాలేదు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో డబ్బింగ్ చిత్రంగా విడుదల అయ్యింది.
అజిత్ ని స్టార్ హీరోను చేసిన వాలి చిత్ర తమిళ్-కన్నడ రీమేక్ రైట్స్ మినహా అన్ని బాషల రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నారు నిర్మాత బోనీ కపూర్. వాస్తవానికి 2020లోనే బోనీ కపూర్ ఈ రైట్స్ దక్కించుకున్నారు. కానీ చిత్ర దర్శకుడు ఎస్ జే సూర్య కోర్టులో కేసు వేయడం, కరోనా కారణంగా ఓ ఏడాది పాటు షూటింగ్ వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఎట్టకేలకు కోర్టు తీర్పు బోనీకి అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కి లైన్ క్లియర్ అయింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని కపూర్స్ వెంచర్, నరసింహ ఎంటర్ ప్రైజస్ సంస్థలు కలిసి నిర్మిస్తాయి. 2022లో ఈ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. త్వరలోనే హీరోహీరోయిన్లతో పాటు టెక్నీషియన్స్ వివరాలు వెల్లడిస్తారు.