Telugu Global
Cinema & Entertainment

అనుభవించు రాజా మూవీ రివ్యూ

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, క‌షీష్ ఖాన్‌, పోసాని కృష్ణముర‌ళి, ఆడుకాల‌మ్ న‌రేన్‌, అజ‌య్‌, సుద‌ర్శ‌న్‌, టెంప‌ర్ వంశీ, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, ర‌వికృష్ణ‌, భూపాల్ రాజు, అరియానా, పమ్మి సాయి, చందు, నాగేంద్ర త‌దిత‌రులు. మ్యూజిక్‌: గోపీసుంద‌ర్ సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్‌ నిర్మాణ సంస్థ‌లు: అన్న‌పూర్ణ స్టూడియోస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి నిర్మాత : సుప్రియ యార్ల‌గ‌డ్డ‌ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీను గ‌విరెడ్డి రేటింగ్: 2/5 కొన్ని సినిమాలకు, కొంతమంది దర్శకులకు ప్యాడింగ్ భలేగా సెట్ అవుతుంది. […]

అనుభవించు రాజా మూవీ రివ్యూ
X

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, క‌షీష్ ఖాన్‌, పోసాని కృష్ణముర‌ళి, ఆడుకాల‌మ్ న‌రేన్‌, అజ‌య్‌, సుద‌ర్శ‌న్‌, టెంప‌ర్ వంశీ, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, ర‌వికృష్ణ‌, భూపాల్ రాజు, అరియానా, పమ్మి సాయి, చందు, నాగేంద్ర త‌దిత‌రులు.
మ్యూజిక్‌: గోపీసుంద‌ర్
సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్‌
నిర్మాణ సంస్థ‌లు: అన్న‌పూర్ణ స్టూడియోస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి
నిర్మాత : సుప్రియ యార్ల‌గ‌డ్డ‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీను గ‌విరెడ్డి
రేటింగ్: 2/5

కొన్ని సినిమాలకు, కొంతమంది దర్శకులకు ప్యాడింగ్ భలేగా సెట్ అవుతుంది. ఇంత చిన్న సినిమాకు అంత మంచి సెటప్పా అని ముక్కున వేలేసుకునేలా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే.. ఆ సెటప్ ను సరిగ్గా వినియోగించుకోలేక ఫ్లాపులు ఇస్తుంటారు కొంతమంది. ఈరోజు రిలీజైన అనుభవించు రాజా సినిమా సరిగ్గా ఇదే కోవకు చెందిన సినిమా.

అన్నపూర్ణ స్టుడియోస్ లాంటి బిగ్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమాకు అన్నీ సమకూరాయి. రాజ్ తరుణ్ లాంటి హీరో దొరికాడు. గోపీసుందర్ లాంటి మ్యూజిక్ డైరక్టర్ దొరికాడు. ఇక ‘అన్నపూర్ణ’ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరికీ తెలిసిందే. ఇంత సెటప్ పెట్టుకున్న దర్శకుడు శ్రీను గవిరెడ్డి మాత్రం అనుభవించు రాజా సినిమాను పూర్తిస్థాయిలో ఆస్వాదించే సినిమాగా మలచలేకపోయాడు.

ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒకటే అనిపిస్తుంది. దర్శకుడు ఏదో కథ అనుకున్నాడు. అందులో నిర్మాతలు వేలు పెట్టారు. హీరో అయితే ఏకంగా కాలు పెట్టాడు. అలా అందరి ఆలోచనలు కలగలిసి ఇదో కిచిడీ అయింది. సినిమా చూస్తున్నంతసేపు ఇదే ఫీలింగ్ కొడుతుంది. ఎందుకంటే, ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ కాదు, అలా అని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్ కాదు, అలా అని మనసుకు హత్తుకునే ప్రేమకథ కూడా కానేకాదు. కానీ అన్ని ఎమోషన్స్, అందినకాడికి అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి ‘అనుభవించండి’ అంటూ కొట్టారు.

భీమవరం పక్కన పల్లెటూరిలో ఉండే బంగారం (రాజ్ తరుణ్) తాత చెప్పిన అనుభవించు రాజా మంత్రం పాటిస్తూ తనకున్న ధనంతో జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఊళ్ళో పందేలు వేస్తూ అల్లరి చిల్లరగా తిరిగే బంగారం ఓ సందర్భంలో తను పుట్టి పెరిగిన ఊళ్ళో పెద్దరికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు. ఈ క్రమంలో అమ్మిరాజు(అజయ్)కి ఎదురువెళ్తాడు. ప్రెసిడెంట్ ఎన్నికల కంటే ముందే ప్రెసిడెంట్ (ఆడుకల‌మ్ న‌రేన్‌) కొడుకు ఊళ్ళో జరిగే జాతరలో ఓ ముఠా చేతిలో హత్యకు గురవుతాడు. ఆ హత్య కేసులో జైలుకి వెళతాడు బంగారం. ఆ తర్వాత జైలు నుండి బయటికివచ్చి సిటీలో ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో సెక్యూరిటీగా పనిచేస్తూ ప్రెసిడెంట్ కొడుకుని హత్య చేసిందవరెవరని తెలుసుకునే పనిలో ఉంటాడు. ఇంతకీ ప్రెసిడెంట్ కొడుకుని హత్య చేయించిందెవరు ? ఆ హత్యకి బంగారంకి సంబంధం ఏమిటి ? ఫైనల్ గా ఈ మిస్టరీని బంగారం ఎలా రివీల్ చేసాడనేది మిగతా కథ.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాను పూర్తిస్థాయిలో బాగాలేదు అనలేం. అలా అని బాగుందని కూడా మనసారా చెప్పలేం. కథలో ఉన్న లేయర్లు, ఆ సంక్లిష్టతల కారణంగా ప్రేక్షకుడికి ఈ ఫీలింగ్ వస్తుంది. ప్రధమార్థం మొత్తాన్ని సెక్యూరిటీ గార్డు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమను చూపించిన దర్శకుడు.. ద్వితీయార్థంలో థ్రిల్ ఇద్దాం అనుకున్నాడు. కానీ ఫస్టాఫ్ లో లవ్ పండలేదు, సెకెండాఫ్ లో థ్రిల్ పేలలేదు. పైపెచ్చు క్లైమాక్స్ చూసిన తర్వాత ఇదేనా అనే ఫీలింగ్ వస్తుంది. అక్కడే దర్శకుడు ఫెయిల్ అయినట్టు లెక్క.

ఉన్నంతలో రాజ్ తరుణ్ ఎప్పట్లానే ఈ సినిమాను శక్తిమేర లాగడానికి ప్రయత్నించాడు. కానీ పేలవమైన కథ, నీరసమైన స్క్రీన్ ప్లే ఉన్న ఈ మూవీని లాగడానికి ఆయన శక్తి సరిపోలేదు. కశిష్ ఖాన్ బాగుంది కానీ ఆమె ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి ఇంకా బాగుంది. అజయ్, సుదర్శన్, పోసాని తమ పాత్రల మేరకు మెప్పించారు. గోపీసుందర్ ను తీసుకున్నారు కానీ అతడి టాలెంట్ ను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. శ్రీను గవిరెడ్డి రచన, దర్శకత్వం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఓవరాల్ గా అనుభవించు రాజా సినిమాలో అనుభూతి చెందడానికేం లేదు. ఫార్ములా సినిమాల్లో బిలో యావరేజ్ మూవీ ఇది.

First Published:  26 Nov 2021 1:16 PM IST
Next Story