Telugu Global
National

మమత, సోనియా మధ్య తారాస్థాయికి చేరుకున్న ఆధిపత్య పోరు..

దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకి అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నేతల్ని కలుపుకొని కూటమి కట్టేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమయ్యే పని కాదని ఇతర పార్టీలకు కూడా తెలుసు. ఈ క్రమంలో కాంగ్రెస్ చేతిలో పావులుగా మారడం కంటే.. సొంతగా తమ ఉనికి చాటుకోవాలని అటు మమతా బెనర్జీ, ఇటు కేజ్రీవాల్ ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా […]

మమత, సోనియా మధ్య తారాస్థాయికి చేరుకున్న ఆధిపత్య పోరు..
X

దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకి అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నేతల్ని కలుపుకొని కూటమి కట్టేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమయ్యే పని కాదని ఇతర పార్టీలకు కూడా తెలుసు. ఈ క్రమంలో కాంగ్రెస్ చేతిలో పావులుగా మారడం కంటే.. సొంతగా తమ ఉనికి చాటుకోవాలని అటు మమతా బెనర్జీ, ఇటు కేజ్రీవాల్ ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలనుకుంటున్నారు మమతా బెనర్జీ. బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం తర్వాత ఆమె దూకుడు మరింత పెరిగింది. బీజేపీని ప్రధాన శత్రువుగా భావిస్తూనే కాంగ్రెస్ ను ఆక్రమించాలని చూస్తున్నారు మమత. కాంగ్రెస్ నేతల్ని తమవైపు తిప్పుకుంటున్నారు. హస్తం పార్టీకి వణుకు పుట్టిస్తున్నారు.

తాజాగా.. హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ సహా, క్రితి ఆజాద్ కి టీఎంసీ కండువాలు కప్పారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత హర్యానాలో అప్నా భారత్ మోర్చా అనే పార్టీ స్థాపించారు తన్వర్, చివరకు సొంతగా రాజకీయాలు చేయలేక ఇలా టీఎంసీలో కలసిపోయారు. హర్యానాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీఎంసీ బలపడుతుందని చెబుతున్నారు మమతా బెనర్జీ. బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యక్తిగత సలహాదారు, జేడీయూ మాజీ నేత పవన్ వర్మ కూడా టీఎంసీ గూటికి చేరుకున్నారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో కీలక నేతలందర్నీ ఒకే గూటి కిందకు చేరుస్తున్నారు మమత. ఇటీవలే గోవాలో కూడా కాంగ్రెస్ సీనియర్లను టీఎంసీలో చేర్చుకుని అక్కడ గట్టి షాకిచ్చారు.

మోదీ, మమత.. ఒకటే పొలిటికల్ డీఎన్ఏ..
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి… మమతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ, నరేంద్రమోదీలో ఒకటే పొలిటికల్ డీఎన్ఏ ఉందని ఆరోపించారు. వారిద్దరివీ ఆధిపత్య రాజకీయాలని విమర్శించారు. అయితే మమతతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఇప్పటికీ స్నేహం కోరుకోవడం విశేషం. ఉత్తరాది రాష్ట్రాల వ్యవహారాలపై మాట్లాడేందుకు మమతను ఢిల్లీకి ఆహ్వానించారు సోనియా. అయితే సరిగ్గా ఆ అపాయింట్ మెంట్ రోజే.. ఆమె కాంగ్రెస్ మాజీ నేతల్ని టీఎంసీలో చేర్చుకోవడం విశేషం. సోనియా స్నేహం కోరుకుంటున్నా.. మమత మాత్రం కాంగ్రెస్ ని అస్సలు లెక్క చేయడంలేదు. బీజేపీని ఢీకొట్టే క్రమంలో కాంగ్రెస్ సారధ్యంలో టీఎంపీ పోరాటం చేయదని, టీఎంసీ సారథ్యంలోనే ఆ పోరాటం మొదలు కావాలనేది మమత ఆలోచన.

First Published:  24 Nov 2021 3:12 AM IST
Next Story