Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 సినిమాలో క్యారెక్టరైజేషన్స్ ఇవే

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతోంది ఎఫ్3 సినిమా. ఈ మూవీలో వెంకటేష్, వరుణ్ పాత్రలేంటనేది అందరికీ తెలిసిందే. ఎఫ్2లో ఉన్న పాత్రల్నే, ఎఫ్3లో కూడా రిపీట్ చేస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్స్ కు ఓ కొత్త టచ్ ఇచ్చాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరికీ రెండు లోపాలు పెట్టాడు. “సినిమాలో వెంకటేష్ కి రేచీకటి ఉంటుంది. అలాగే వరుణ్ కి నత్తి ఉంటుంది. కాకపోతే అది సినిమా అంతా లేకుండా ఎక్కడా […]

ఎఫ్3 సినిమాలో క్యారెక్టరైజేషన్స్ ఇవే
X

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతోంది ఎఫ్3 సినిమా. ఈ మూవీలో వెంకటేష్, వరుణ్ పాత్రలేంటనేది అందరికీ తెలిసిందే. ఎఫ్2లో ఉన్న పాత్రల్నే, ఎఫ్3లో కూడా రిపీట్ చేస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్స్ కు ఓ కొత్త టచ్ ఇచ్చాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరికీ రెండు లోపాలు పెట్టాడు.

“సినిమాలో వెంకటేష్ కి రేచీకటి ఉంటుంది. అలాగే వరుణ్ కి నత్తి ఉంటుంది. కాకపోతే అది సినిమా అంతా లేకుండా ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎక్కడ అవసరమో అక్కడ ఉంటుంది. కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడల్లా హిలేరియస్ గా ఉంటుంది.”

ఇలా సినిమాకు సంబంధించి కీలకమైన విషయాన్ని బయటపెట్టాడు రావిపూడి. ఈరోజు ఈ డైరక్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్3లో హీరోల పాత్రల వివరాల్ని వెల్లడించాడు. సినిమా ఫస్టాఫ్ రెడీ అయిపోయిందని, వెంకీకి నచ్చిందని అంటున్నాడు.

“రీసెంట్ గా వెంకటేష్ ఫస్ట్ హాఫ్ వరకూ చూశారు. ‘ఏంటమ్మా ఇది అందరూ ఇరగదీసేసారు’ అన్నారు. ఈసారి వెంకటేష్, వరుణ్ లతో పాటు అందరికీ స్కోప్ ఉంది. సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ ఇలా అందరి క్యారెక్టర్స్ క్లిక్ అవుతాయి.”

దిల్ రాజు బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఎఫ్3 సినిమా. మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

First Published:  23 Nov 2021 8:07 AM IST
Next Story