రికార్డు స్థాయికి టమోటా ధర కిలో. 130..!
వంటింట్లో టమోటాలు లేకపోతే ఏ వంట చేయాలన్న కష్టమే. ప్రస్తుతం మండిపోతున్న ధరలతో వంటింటి నుంచి టమోటా మాయమవుతోంది. రెండు వారాల కిందట కురిసిన తుఫానుతో కిలో టమోటా ధర రూ. వంద వరకూ పలికింది. ఆ తర్వాత మళ్లీ కిలో రూ. 60 కి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో కిలో టమోటా ధర రూ 130కి చేరింది. టమోటా రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగవుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లె, పలమనేరు, కడప […]
వంటింట్లో టమోటాలు లేకపోతే ఏ వంట చేయాలన్న కష్టమే. ప్రస్తుతం మండిపోతున్న ధరలతో వంటింటి నుంచి టమోటా మాయమవుతోంది. రెండు వారాల కిందట కురిసిన తుఫానుతో కిలో టమోటా ధర రూ. వంద వరకూ పలికింది. ఆ తర్వాత మళ్లీ కిలో రూ. 60 కి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో కిలో టమోటా ధర రూ 130కి చేరింది.
టమోటా రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగవుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లె, పలమనేరు, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కోలారు ప్రాంతాల్లో టమోటాను అధికంగా సాగు చేస్తారు. కాగా వరుస తుఫాన్ లతో టమోటా పంట పూర్తిగా దెబ్బతింది. వర్షానికి కాయలపై పగుళ్లు రావడం, నేల రాలుతుండడం, కొన్నిచోట్ల వరదలకు పూర్తిగా పంట కొట్టుకుపోవడంతో టమోటా ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
మదనపల్లె మార్కెట్లో కిలో టమోటా ధర 130
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మదనపల్లె మార్కెట్ నుంచి టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె, పలమనేరు ప్రాంతంలో టమోటా పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మార్కెట్ కు టమోటాలు అతి తక్కువగా వస్తున్నాయి. దీంతో మంగళవారం మార్కెట్లో కిలో టమోటా ధర రూ.130 పలికింది. టమోటా ధర ఎప్పుడూ ఇంత రేటు పలికింది లేదని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
టమోటా ధరలు అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ ఛత్తీస్ గడ్ లో సాగవుతున్న టమోటాలను కొని రాష్ట్రంలోని పలు మార్కెట్లకు కిలో రూ.70కి సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ అతి తక్కువ మార్కెట్లకు మాత్రమే ఈ టమోటాలను సరఫరా చేస్తోంది. ఈ టమోటాలను రాష్ట్రంలోని మరికొన్ని మార్కెట్లకు సరఫరా చేస్తే గానీ ధర అదుపులోకి వచ్చే అవకాశం లేదు.