ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్ డేట్స్
ఆర్ఆర్ఆర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు ఎన్టీఆర్. కేవలం ఆ సినిమా రిజల్ట్ కోసం మాత్రమే కాదు, అది థియేటర్లలోకి వచ్చేసిన తర్వాత తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 2 సినిమాలున్నాయి. అవి ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయనే విషయంపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు స్వయంగా ఎన్టీఆర్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు తారక్. జనతా గ్యారేజ్ […]
ఆర్ఆర్ఆర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు ఎన్టీఆర్. కేవలం ఆ సినిమా రిజల్ట్ కోసం మాత్రమే కాదు, అది థియేటర్లలోకి వచ్చేసిన తర్వాత తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 2 సినిమాలున్నాయి. అవి ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయనే విషయంపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు స్వయంగా ఎన్టీఆర్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు తారక్. జనతా గ్యారేజ్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ఇదే. మూవీ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఎన్టీఆర్. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.
ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కేజీఎఫ్ లెవెల్లో పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతోంది.
కొరటాల శివ సినిమా 2022 దసరా సీజన్ కు, ప్రశాంత్ నీల్ సినిమా 2023 సమ్మర్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలన్నింటినీ స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించాడు.