Telugu Global
Cinema & Entertainment

బంగార్రాజు నుంచి చైతూ టీజర్

ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమా నుంచి అతడి ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈరోజు టీజర్ విడుదల చేశారు. కలర్ ఫుల్ షర్ట్ , జీన్స్ వేసుకొని కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని, చేతికి బ్రాస్ లెట్ వేసుకొని కర్రని విసురుతూ స్టైలిష్ లుక్ తో చైతూ లుక్ ఆకట్టుకుంది. ముందుగా నాగార్జున కటౌట్ చూపించి, ఆ తర్వాత ఆ లక్షణాలతో నాగచైతన్యను చూపించడంతో బంగార్రాజులో చైతూ […]

nagachaitanya bangarraju
X

ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమా నుంచి అతడి ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈరోజు టీజర్ విడుదల చేశారు. కలర్ ఫుల్ షర్ట్ , జీన్స్ వేసుకొని కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని, చేతికి బ్రాస్ లెట్ వేసుకొని కర్రని విసురుతూ స్టైలిష్ లుక్ తో చైతూ లుక్ ఆకట్టుకుంది. ముందుగా నాగార్జున కటౌట్ చూపించి, ఆ తర్వాత ఆ లక్షణాలతో నాగచైతన్యను చూపించడంతో బంగార్రాజులో చైతూ క్యారెక్టర్ పై అంచనాలు పెరిగాయి.

రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనుంది. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల నాగ చైతన్య విడుదల చేశాడు. ఇప్పుడు నాగచైతన్య టీజర్ కూడా వచ్చేయడంతో.. ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రల ఫస్ట్ లుక్స్ అన్నీ రిలీజైనట్టయింది.

లడ్డుండా అనే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకు విశేష స్పందన లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

First Published:  23 Nov 2021 8:25 AM IST
Next Story