Telugu Global
Cinema & Entertainment

బన్నీ కూతురు అక్కడ.. ఎన్టీఆర్ కొడుకు ఇక్కడ

టాలీవుడ్ లో మరోసారి విహార యాత్రల సీజన్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఈసారి ఇద్దరు స్టార్ హీరోలు తమ కుటుంబాలతో కలిసి హాలిడేస్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్ వద్ద కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేశాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మరో హీరో ఎన్టీఆర్ కూడా తన కుటుంబంతో […]

బన్నీ కూతురు అక్కడ.. ఎన్టీఆర్ కొడుకు ఇక్కడ
X

టాలీవుడ్ లో మరోసారి విహార యాత్రల సీజన్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఈసారి ఇద్దరు స్టార్ హీరోలు తమ కుటుంబాలతో కలిసి హాలిడేస్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్ వద్ద కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేశాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అటు మరో హీరో ఎన్టీఆర్ కూడా తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ టూర్ పెట్టుకున్నాడు. మధ్యలో పారిస్ లో ఆగాడు. ఐఫిల్ టవర్ వద్ద కొడుకుతో కలిసి ఫొటో దిగాడు. ఎన్టీఆర్ కొడుకు అభిరామ్ మీడియాకు కనిపించి చాన్నాళ్లయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఐఫిల్ టవర్ బ్యాక్ డ్రాప్ లో తండ్రితో కలిసి ఫొటో దిగాడు అభిరామ్.

ఇలా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి టూర్లు పెట్టుకోవడం విశేషంగా మారింది. బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్-1 మూవీ చేస్తున్నాడు. డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. జనవరి 7న ఈ సినిమా విడుదలవుతుంది. త్వరలోనే ఈ హీరోలిద్దరూ తమ సినిమాల ప్రచారంలో బిజీ కాబోతున్నారు. ఈ గ్యాప్ లో ఇలా విహారయాత్రలు చేస్తున్నారు.

First Published:  22 Nov 2021 3:15 AM IST
Next Story