Telugu Global
NEWS

3 జిల్లాలకు వరదలు 3 రాష్ట్రాల మధ్య స్తంభించిన రాకపోకలు..

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. పలు కాలనీలు నీటమునిగాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. కడప, నెల్లూరు జిల్లాల్లో వంతెనలు కొట్టుకుపోవడం, హైవేలకు సైతం గండ్లు పడటంతో రోడ్డు రవాణా అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల జాతీయ రహదారులపై వరదనీరు తిష్టవేసింది. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు.. ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. దీంతో ఏపీ, తమిళనాడు […]

3 జిల్లాలకు వరదలు 3 రాష్ట్రాల మధ్య స్తంభించిన రాకపోకలు..
X

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. పలు కాలనీలు నీటమునిగాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. కడప, నెల్లూరు జిల్లాల్లో వంతెనలు కొట్టుకుపోవడం, హైవేలకు సైతం గండ్లు పడటంతో రోడ్డు రవాణా అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల జాతీయ రహదారులపై వరదనీరు తిష్టవేసింది.

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు..
ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. దీంతో ఏపీ, తమిళనాడు మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 2 రోజులుగా ఈ మార్గంలో రైళ్లు తిరగడంలేదు. ఈ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అటు తెలంగాణ నుంచి రావాల్సిన రైళ్లు కూడా రద్దయ్యాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలో 39 రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. 42 రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ డివిజన్ పరిధిలో 155 రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. 43 రైళ్లను దారి మళ్లించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ లను గంటల వ్యవధిలో పునరుద్ధరించగల సత్తా రైల్వే డిపార్ట్ మెంట్ కి ఉంది. యుద్ధప్రాతిపదికన పనులు మొదలు పెట్టి వెంటనే ట్రాక్ లను సరిచేసి, రైళ్లను పట్టాలెక్కిస్తారు. కానీ ఇక్కడ రోజులు గడుస్తున్నా పనులు మొదలు పెట్టేందుకు అవకాశం లేదు. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పట్టాల పునరుద్ధరణ ఇంకా మొదలు కాలేదు.

నిలిచిపోయిన రైళ్లు, ప్రయాణికుల అవస్థలు..
బస్సు రవాణా సరిగా లేదు, రైళ్లు ఎక్కడికక్కడ స్టేషన్లలోనే నిలిచిపోవడంతో.. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ట్రాక్ లు కొట్టుకుపోయాయని చెబుతున్నారు అధికారులు. యుద్ధప్రాతిపదికన వీటి మరమ్మతులు చేపడతామన్నారు విజయవాడ డివిజనల్ మేనేజర్. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మంచినీరు, టాయిలెట్స్.. ఇతర వసతులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

First Published:  22 Nov 2021 3:45 AM IST
Next Story