Telugu Global
NEWS

ఏపీలో కొవిడ్ మరణాలు జీరో.. మార్చి 28 తర్వాత ఇదే తొలిసారి..

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చేస్తున్నాయి. అయితే పండగలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా కొవిడ్ వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు వెంటాడుతున్నాయి. దసరా, దీపావళి తర్వాత కూడా కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించిన దాఖలాలు లేవు. తాజాగా.. ఏపీ ప్రజలకు మరింత సంతోషాన్నిచ్చే విషయం ఇది. ఏపీలో కొవిడ్ మరణాలు సున్నాకు చేరుకున్నాయి. గడచిన 24గంటల్లో ఏపీలో కొవిడ్ మరణాల సంఖ్య జీరో అని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 28 […]

ఏపీలో కొవిడ్ మరణాలు జీరో.. మార్చి 28 తర్వాత ఇదే తొలిసారి..
X

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చేస్తున్నాయి. అయితే పండగలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా కొవిడ్ వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు వెంటాడుతున్నాయి. దసరా, దీపావళి తర్వాత కూడా కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించిన దాఖలాలు లేవు. తాజాగా.. ఏపీ ప్రజలకు మరింత సంతోషాన్నిచ్చే విషయం ఇది. ఏపీలో కొవిడ్ మరణాలు సున్నాకు చేరుకున్నాయి. గడచిన 24గంటల్లో ఏపీలో కొవిడ్ మరణాల సంఖ్య జీరో అని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 28 తర్వాత కొవిడ్ మరణాలు సున్నాకు చేరడం ఇదే తొలిసారి.

సెకండ్ వేవ్ ప్రభావం మొదలైన తర్వాత ఏపీలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఓ దశలో రోజుకి 200కి పైగా మరణాలు కూడా రికార్డ్ అయ్యాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న క్రమంలో ఏపీలో కూడా కేసుల సంఖ్య తగ్గింది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఇప్పటి వరకూ సున్నాకు చేరలేదు. గత వారం రోజులుగా రోజుకి కనీసం ఒక్కరైనా కరోనాతో చనిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడచిన వారంలో 11మంది కొవిడ్ తో ప్రాణాలు వదిలారు. తాజాగా ఒకరోజు కొవిడ్ మరణాలు సున్నాకు చేరుకున్నాయి.

గడచిన 24 గంటల్లో కొత్తగా ఏపీలో 174మందికి కొవిడ్ సోకింది. కృష్ణాజిల్లాలో అత్యథికంగా 32 కేసులు నమోదు కాగా, కర్నూలులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 20,68,349 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14,426 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 2265మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. రికవరీ రేటు 99.19శాతంగా ఉంది. మార్చి 28 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కొవిడ్ మరణాలేవీ సంభవించని రోజులోకి వచ్చామని చెబుతున్నారు అధికారులు.

First Published:  22 Nov 2021 4:45 AM IST
Next Story