చిరంజీవితో వెంకీ కుడుముల చిత్రం?
చిరంజీవికి సినిమాలకు సంబంధించి మరో ఆసక్తికర చర్చ ఊపందుకుంది. త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట మెగాస్టార్. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇది. డీవీవీ దానయ్య నిర్మాతగా అతి త్వరలోనే ఈ సినిమా ప్రకటన వస్తుందంటున్నారు. రీసెంట్ గా యంగ్ డైరక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు చిరంజీవి. బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా పైప్ లైన్లో ఉంది. ఈ క్రమంలో […]
చిరంజీవికి సినిమాలకు సంబంధించి మరో ఆసక్తికర చర్చ ఊపందుకుంది. త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట మెగాస్టార్. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇది. డీవీవీ దానయ్య నిర్మాతగా అతి త్వరలోనే ఈ సినిమా ప్రకటన వస్తుందంటున్నారు.
రీసెంట్ గా యంగ్ డైరక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు చిరంజీవి. బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా పైప్ లైన్లో ఉంది. ఈ క్రమంలో వెంకీ కుడుములకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పక్కా కమర్షియల్ సినిమాలకు, వినోదానికి కేరాఫ్ అడ్రస్ వెంకీ కుడుముల. అతడు తీసిన ఛలో, భీష్మ సినిమాలు ఫుల్ లెంగ్త్ వినోదాన్ని పంచాయి. చిరంజీవితో కూడా అదే ఫార్ములా సినిమా తీయబోతున్నాడట వెంకీ కుడుముల. 2023లో ఈ సినిమా పట్టాలపైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.