భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్
ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ మార్కెట్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ను సవరించిన సంగతి తెలిసిందే. దాదాపు 30శాతం రేట్లు తగ్గించుకున్నారు. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ను దాదాపు 130 కోట్ల రూపాయల వరకు అనుకున్నారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో.. భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ను 93 కోట్ల రూపాయలకు కుదించుకున్నట్టు తెలుస్తోంది. నైజాంలో భీమ్లానాయక్ సినిమాను దిల్ […]
ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ మార్కెట్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ను సవరించిన సంగతి తెలిసిందే. దాదాపు 30శాతం రేట్లు తగ్గించుకున్నారు. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ను దాదాపు 130 కోట్ల రూపాయల వరకు అనుకున్నారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో.. భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ను 93 కోట్ల రూపాయలకు కుదించుకున్నట్టు తెలుస్తోంది.
నైజాంలో భీమ్లానాయక్ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నారు. నైజాంలో ఈ సినిమా హక్కుల్ని 36 కోట్ల రూపాయలకు దిల్ రాజు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక కోస్తాంధ్రలో ఈ సినిమా మరో 30 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా 93-95 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ను క్లోజ్ చేయాలని అనుకుంటున్నారు.
మరోవైపు భీమ్లానాయక్ విడుదల తేదీపై మేకర్స్ మరోసారి స్పష్టత ఇచ్చారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోనే దిగనుంది. జనవరి 12న భీమ్లానాయక్ థియేటర్లలోకి వస్తుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను వాయిదా వేయించేందుకు టాలీవుడ్ ప్రముఖులు కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ మధ్య పోటీ అధికారికమైంది.