15మందితో రాజస్థాన్ కొత్త మంత్రివర్గం..
అంతర్గత కుమ్ములాటలను సరైన సమయంలో పరిష్కరించకపోవడంతో పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. సీఎం మార్పుతో అధిష్టానం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని చూసినా.. సిద్ధూ అలకలతో అక్కడ కాంగ్రెస్ పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా ఉంది. అలాంటి పరిస్థితి రాజస్థాన్ లో కూడా ఎదురవుతుందనే క్రమంలో ముందుగానే అధిష్టానం దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. సచిన్ పైలట్ వర్గానికి మార్గం సుగమం చేస్తూ మంత్రులతో మూకుమ్మడి రాజీనామాలు చేయించింది. అశోక్ గెహ్లాత్ మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆ స్థానంలో […]
అంతర్గత కుమ్ములాటలను సరైన సమయంలో పరిష్కరించకపోవడంతో పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. సీఎం మార్పుతో అధిష్టానం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని చూసినా.. సిద్ధూ అలకలతో అక్కడ కాంగ్రెస్ పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా ఉంది. అలాంటి పరిస్థితి రాజస్థాన్ లో కూడా ఎదురవుతుందనే క్రమంలో ముందుగానే అధిష్టానం దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. సచిన్ పైలట్ వర్గానికి మార్గం సుగమం చేస్తూ మంత్రులతో మూకుమ్మడి రాజీనామాలు చేయించింది. అశోక్ గెహ్లాత్ మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 15మందితో కొత్త కేబినెట్ కొవులుదీరబోతోంది.
పట్టు నిలుపుకోడానికి పైలట్ ప్రయత్నాలు..
రాజస్థాన్ లో సీఎం కుర్చీ ఆశించి భంగపడిన సచిన్ పైలట్.. ఓ దశలో బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపులకి మెత్తబడ్డారు. గతేడాది ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన వర్గాన్ని ఓ చోట చేర్చి సీఎం అశోక్ గెహ్లాత్ కి పక్కలో బల్లెంలా మారారు సచిన్ పైలట్. అప్పటినుంచి వారిద్దరూ ఉప్పు-నిప్పులా ఉన్నారు. చివరకు ఇన్నాళ్లకు సచిన్ పైలట్ వర్గానికి కేబినెట్ లో సముచిత స్థానం కల్పిస్తూ అధిష్టానం తన వ్యూహాన్ని అమలులో పెట్టింది.
ఒకరికి ఒక పదవి..
ఒక నాయకుడికి ఒకటే పదవి అనే ఫార్ములాతో.. కొంతమందిని పార్టీకి పరిమితం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ పదవులు లేనివారికి ఇప్పుడు కేబినెట్ లో చోటు కల్పించబోతోంది. మొత్తం 15మందితో కొలువుదీరబోతున్న కొత్త మంత్రివర్గంలో 11మందికి కేబినెట్ పదవులు, నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 12మంది కొత్తవారికి ఈ దఫా మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు. అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు.