Telugu Global
Cinema & Entertainment

హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు

హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు. మెగాస్టార్ చిరంజీవి వీళ్ల పెళ్లికి హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో కార్తికేయ-లోహిత వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి చిరంజీవితో పాటు అల్లు అరవింద్, అజయ్ భూపతి, సాయికుమార్, తనికెళ్ల భరణి, పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు. కార్తికేయ-లోహిత లవర్స్. ఇంజనీరింగ్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని […]

హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు
X

హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు. మెగాస్టార్ చిరంజీవి వీళ్ల పెళ్లికి హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో కార్తికేయ-లోహిత వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి చిరంజీవితో పాటు అల్లు అరవింద్, అజయ్ భూపతి, సాయికుమార్, తనికెళ్ల భరణి, పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు.

కార్తికేయ-లోహిత లవర్స్. ఇంజనీరింగ్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు కార్తికేయ. సరిగ్గా తన నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు మాత్రమే తన ప్రేమ సంగతిని బయట ప్రపంచానికి తెలియజేశాడు. పెళ్లి తేదీ విషయంలో కూడా అంతే గుంభనంగా ఉన్నాడు. రాజా విక్రమార్క ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పెళ్లి తేదీని వెల్లడించాడు.

ఆర్ఎక్స్100తో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత 90ఎంఎల్, చావు కబురు చల్లగా, గ్యాంగ్ లీడర్, రాజా విక్రమార్క సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అతడు నటించిన వాలిమై సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా కనిపించబోతున్నాడు.

First Published:  21 Nov 2021 12:27 PM IST
Next Story