Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సినిమాకు లైన్ క్లియర్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`.. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రంలోని గ్రాండ్ విజువల్స్‌, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు. సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా […]

బాలయ్య సినిమాకు లైన్ క్లియర్
X

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'.. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.

ఈ చిత్రంలోని గ్రాండ్ విజువల్స్‌, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు.

సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుంది. మ‌రోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ కానుంది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌నుంది. త‌మ‌న్ మ్యూజిక్‌, ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్స్‌.

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. టైటిల్ సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్.

First Published:  21 Nov 2021 12:15 PM IST
Next Story