Telugu Global
Cinema & Entertainment

నాగార్జునతో చిందేయనున్న చిట్టి

నాగార్జున సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ నిజంగానే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముగ్గురు ముద్దుగుమ్మలతో ఇరగదీశాడు నాగ్. ఇప్పుడు అలాంటిదే మరో ప్రత్యేక గీతాన్ని, బంగార్రాజు సినిమాలో కూడా పెడుతున్నారు. ఈ సాంగ్ కోసం జారితర్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను తీసుకున్నారు. ‘జాతిరత్నాలు’ ప్రమోషన్స్ లో ఫరియా డాన్స్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా కొన్ని ఈవెంట్స్ లో […]

నాగార్జునతో చిందేయనున్న చిట్టి
X

నాగార్జున సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ నిజంగానే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముగ్గురు ముద్దుగుమ్మలతో ఇరగదీశాడు నాగ్. ఇప్పుడు అలాంటిదే మరో ప్రత్యేక గీతాన్ని, బంగార్రాజు సినిమాలో కూడా పెడుతున్నారు. ఈ సాంగ్ కోసం జారితర్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను తీసుకున్నారు.

‘జాతిరత్నాలు’ ప్రమోషన్స్ లో ఫరియా డాన్స్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా కొన్ని ఈవెంట్స్ లో తన డాన్సింగ్ టాలెంట్ చూపించింది ఫరియా. అందుకే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమెని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. పైగా నాగార్జున హైట్ కు, ఫరియా సరిగ్గా సరిపోతుంది.

ఇక ఈ సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకుంది. ప్రస్తుతం మైసూర్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ రాగానే స్పెషల్ సాంగ్ షూట్ మొదలుపెడతారు. మరి ఈ సాంగ్ లో నాగ్ తో కలిసి చైతూ కూడా డాన్స్ చేస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

అన్నపూర్ణ స్టూడియోస్ , జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరక్టర్.

First Published:  20 Nov 2021 2:05 PM IST
Next Story