నాగలక్ష్మిగా మారిన కృతిషెట్టి
సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది. బంగార్రాజు సినిమాను ప్రకటించిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. సోగ్గాడే చిన్న నాయన సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ కృష్ణ అద్బుతమైన కథతో రాబోతోన్నారు. ప్రీక్వెల్‌లో ఉన్నట్టుగానే నాగార్జున సరసన రమ్యకష్ణ నటిస్తోంది. నాగార్జున, రమ్యకృష్ణలతో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలను కళ్యాణ్ […]
సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది. బంగార్రాజు సినిమాను ప్రకటించిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. సోగ్గాడే చిన్న నాయన సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ కృష్ణ అద్బుతమైన కథతో రాబోతోన్నారు. ప్రీక్వెల్‌లో ఉన్నట్టుగానే నాగార్జున సరసన రమ్యకష్ణ నటిస్తోంది.
నాగార్జున, రమ్యకృష్ణలతో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలను కళ్యాణ్ కృష్ణ చూపించబోతోన్నారు. నాగచైతన్య, కృతి శెట్టిలు మరో జోడిగా కనిపించబోతోన్నారు. కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగచైతన్య రివీల్ చేశాడు. నాగలక్ష్మీ పాత్రలో కృతిశెట్టిని అందరికీ పరిచయం చేశారు.
బంగార్రాజు త్వరలోనే రాబోతోంది. లేడీస్ ఫస్ట్.. నాగలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. ఎన్నికల్లో గెలిచినట్టుగా చేతిని ఊపుతూ నాగలక్ష్మీ కనిపిస్తోంది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఎంతో అందంగా ఉంది. పోస్టర్‌ను బట్టి చూస్తే కృతి శెట్టి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. నటీనటులందరి మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.