Telugu Global
CRIME

చిన్నారులతో బూతు వీడియోలు.. ఏపీలో కూడా నీఛులు..

కరోనా లాక్ డౌన్ కాలంలో పోర్న్ వీడియోల విష సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది నీఛులు చిన్నారుల జీవితాలను బలి తీసుకుంటున్నారు. చిన్నారులతో బూతు వీడియోలు చిత్రీకరించి వాటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి పోర్న్ వీడియోల కేసులోనే శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా పోలీస్ విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చైల్డ్ పోర్న్ వీడియోలపై సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా 83మంది […]

చిన్నారులతో బూతు వీడియోలు.. ఏపీలో కూడా నీఛులు..
X

కరోనా లాక్ డౌన్ కాలంలో పోర్న్ వీడియోల విష సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది నీఛులు చిన్నారుల జీవితాలను బలి తీసుకుంటున్నారు. చిన్నారులతో బూతు వీడియోలు చిత్రీకరించి వాటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి పోర్న్ వీడియోల కేసులోనే శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా పోలీస్ విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చైల్డ్ పోర్న్ వీడియోలపై సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా 83మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అరెస్ట్ లతో హడలెత్తిస్తోంది.

తిరుపతిలో ఓ నీఛుడు అరెస్ట్..
చిన్నారులతో పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తూ, వాటిని సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసుకుంటూ.. పోర్న్ వీడియో సైట్లకు, ఇతర ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్న టి.మోహన కృష్ణ అనే వ్యక్తిని తిరుపతిలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ కేసు విచారణ బాధ్యతను చిత్తూరు జిల్లా సీబీఐ ఎస్పీ సునీల్ సింగ్ రావత్ కు అప్పగించినట్టు అధికారులు తెలిపారు.

100 దేశాల్లో వ్యాపారం..
ఆన్ లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్ ని అరికట్టేందుకు రంగంలోకి దిగిన సీబీఐ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, యూపీ, పంజాబ్, బీహార్, ఛ‌త్తీస్‌ ఘఢ్, ఒడిశా, రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో త‌నిఖీలు చేపట్టింది. సోదాలు నిర్వహించి, ఇప్ప‌టికే ప‌లు వీడియోలు సీజ్ చేసింది. 100కు పైగా దేశాలకు భారత్ నుంచి ఈ వీడియోలు వెళ్తున్నాయని తేల్చింది. 50 గ్రూపులు ఈ చైల్డ్ పోర్న్ వీడియోలతో వ్యాపారం చేస్తున్నాయి. సుమారు 5వేలమందికి ఇందులో భాగస్వామ్యం ఉంది. వారిలో ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తామని సీబీఐ అధికారులు చెబుతున్నారు.

First Published:  17 Nov 2021 2:53 AM IST
Next Story