ప్రపంచం గేట్లు ఎత్తేసింది.. కేరళ-కర్నాటక కొట్టుకుంటున్నాయి..
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో.. అంతర్జాతీయ రవాణా సౌకర్యం బాగా మెరుగైంది. కొవిడ్ సర్టిఫికెట్ ఉంటే చాలు, క్వారంటైన్ కూడా అవసరం లేదంటూ భారత్ గేట్లు ఎత్తేసింది. ఈ క్రమంలో కేరళ, కర్నాటక మాత్రం ఇంకా సరిహద్దు బస్సుల విషయంలో కొట్టుకుంటున్నాయి. ఈ రాష్ట్రం బస్సు ఆ రాష్ట్రంలో తిరగడానికి వీలు లేదు, ఆ రాష్ట్రం బస్సు ఈ రాష్ట్రంలోకి రాకూడదు అంటూ గిరిగీసుకున్నాయి. అటు లోకల్ ట్రైన్స్ కూడా లేకపోవడంతో సరిహద్దు జిల్లాల్లో నివశించే […]
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో.. అంతర్జాతీయ రవాణా సౌకర్యం బాగా మెరుగైంది. కొవిడ్ సర్టిఫికెట్ ఉంటే చాలు, క్వారంటైన్ కూడా అవసరం లేదంటూ భారత్ గేట్లు ఎత్తేసింది. ఈ క్రమంలో కేరళ, కర్నాటక మాత్రం ఇంకా సరిహద్దు బస్సుల విషయంలో కొట్టుకుంటున్నాయి. ఈ రాష్ట్రం బస్సు ఆ రాష్ట్రంలో తిరగడానికి వీలు లేదు, ఆ రాష్ట్రం బస్సు ఈ రాష్ట్రంలోకి రాకూడదు అంటూ గిరిగీసుకున్నాయి. అటు లోకల్ ట్రైన్స్ కూడా లేకపోవడంతో సరిహద్దు జిల్లాల్లో నివశించే విద్యార్థులు, చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేరళ నుంచి దక్షిణ కర్నాటక ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు తీవ్రంగా కష్టపడుతున్నారు. కేరళ సరిహద్దు జిల్లాల్లో ఉప్పాల, మంజేశ్వర, హోసన్ గడి, కుంజత్తూరు ప్రాంతాలనుంచి వేలాదిమంది నిత్యం కర్నాటక లోని మంగళూరు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వీరంతా ఇక్కడ బస్సు ఎక్కితే నేరుగా అక్కడ దిగేసేవారు. కానీ ఇప్పుడు రెండు బస్సులు కచ్చితంగా మారాలి, ప్రైవేటు ట్రావెల్స్ పై కూడా ఆధారపడాల్సి రావడంతో ఆర్థికంగా కూడా కష్టంగా మారింది. మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండటంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఎవరూ పట్టించుకోరు..
ఇటు బస్సు సర్వీసుల్ని పునరుద్ధరించడంలో రెండు రాష్ట్రాలు పట్టుదలతో ఉన్నాయి. అటు రైలు సర్వీసులు కూడా అందుబాటులో లేవు. గతంలో మంగళూరు-పుత్తూరు ట్రైన్ సర్వీసు.. విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగంగా ఉండేది. ఇప్పుడది క్యాన్సిల్ అయింది, కొవిడ్-19 తర్వాత ఇతర ప్రాంతాల్లో అన్ని సర్వీసులు సాధారణ స్థితికి వస్తున్నా.. ఈ లోకల్ ట్రైన్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో అటు బస్సులు లేక, ఇటు రైళ్లు లేక సరిహద్దు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలపై నిషేధాలు తొలగిపోయి, అంతా సవ్యంగా సాగుతున్నవేళ, ఇలా పక్క పక్క రాష్ట్రాలు పట్టుదలకు పోవడం మాత్రం విచిత్రంగా తోస్తుంది.