Telugu Global
NEWS

కౌశిక్ కి న్యాయం.. వెంకట్రామిరెడ్డికి ఛాన్స్..

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాష్ లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఆరు స్థానాలు టీఆర్ఎస్ కి ఏకగ్రీవం అవుతాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన కౌశిక్ రెడ్డిని తొలుత […]

కౌశిక్ కి న్యాయం.. వెంకట్రామిరెడ్డికి ఛాన్స్..
X

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాష్ లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఆరు స్థానాలు టీఆర్ఎస్ కి ఏకగ్రీవం అవుతాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన కౌశిక్ రెడ్డిని తొలుత గవర్నర్ కోటాలో మండలికి పంపించాలని భావించారు కేసీఆర్. అయితే గవర్నర్ తమిళిసై షాకివ్వడంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డి పేరు చేర్చారు. ఇక సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రామి రెడ్డి పేరు కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఆయన్ను గతంలో ఓసారి ఎంపీ అభ్యర్థిగా, మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా చివరకు ఇలా ఎమ్మెల్సీని చేస్తున్నారు కేసీఆర్.

మిగతావారందరి విధేయతకు మరో దఫా వీరతాళ్లు పడినట్టే అనుకోవాలి. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంలో ఎలాంటి సంచలనం లేదు. చివరి వరకు ఆశావహుల జాబితాలో ఉన్న ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారికి నిరాశ తప్పలేదు.

బండ ప్రకాష్ కి మంత్రి పదవి..?
ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న బండ ప్రకాష్ ప్రస్తుతం రాజ్య‌స‌భ సభ్యుడిగా ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయనను ఈట‌ల‌కు పోటీగా కేసీఆర్ తెరపైకి తెస్తున్నారు. ఎమ్మెల్సీగా ఎంపిక‌చేసి కేబినెట్‌లో స్థానం ఇస్తారని అంటున్నారు.

First Published:  16 Nov 2021 8:01 AM IST
Next Story