Telugu Global
Cinema & Entertainment

తమన్ 'భీమ్లా నాయక్' ముచ్చట్లు

స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించడానికి మ్యూజిక్ డైరక్టర్లు చాలా కష్టపడతారు. అవసరమైతే ఆ ప్రాజెక్టు కోసం మరికొన్ని సినిమాల్ని కూడా త్యాగం చేస్తారు. మరి భీమ్లానాయక్ లాంటి పెద్ద సినిమా కోసం తమన్ ఎంత కష్టపడి ఉంటాడు. సరిగ్గా ఇక్కడే షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు తమన్. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి జస్ట్ 4 రోజుల్లో 4 పాటలు పూర్తిచేశాడట తమన్. అది కూడా కారవాన్ లో. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో […]

తమన్ భీమ్లా నాయక్ ముచ్చట్లు
X

స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించడానికి మ్యూజిక్ డైరక్టర్లు చాలా కష్టపడతారు. అవసరమైతే ఆ ప్రాజెక్టు కోసం మరికొన్ని సినిమాల్ని కూడా త్యాగం చేస్తారు. మరి భీమ్లానాయక్ లాంటి పెద్ద సినిమా కోసం తమన్ ఎంత కష్టపడి ఉంటాడు. సరిగ్గా ఇక్కడే షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు తమన్. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి జస్ట్ 4 రోజుల్లో 4 పాటలు పూర్తిచేశాడట తమన్. అది కూడా కారవాన్ లో.

అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో భీమ్లానాయక్ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ జరిగింది. ఆ షూటింగ్ టైమ్ లో లొకేషన్ కు రెగ్యులర్ గా వెళ్లేవాడట తమన్. అలా లొకేషన్ లోనే కారవాన్ లో కూర్చొని భీమ్లానాయక్ పాటలు కంపోజ్ చేశాడట ఈ స్టార్ డైరక్టర్.

అయితే ఈ పాటలు ఇంత త్వరగా పూర్తవ్వడానికి కారణం సినిమా టైటిల్ అన్నాడు తమన్. ఎప్పుడైతే భీమ్లానాయక్ అనే పేరు పెట్టబోతున్నట్టు చెప్పారో, ఆ వెంటనే అతడి మైండ్ లోకి చాలా ట్యూన్స్ వచ్చాయట. అలా టైటిల్ సాంగ్ ను మెరుపువేగంతో పూర్తిచేసిన తమన్.. ఆ వెంటనే మిగతా పాటల్ని కూడా మినిమం గ్యాప్స్ లో కంప్లీట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో త్రివిక్రమ్ సలహాలు తనకు బాగా పనికొచ్చాయంటున్నాడు.

First Published:  16 Nov 2021 1:54 PM IST
Next Story