Telugu Global
Others

ఆన్ లైన్ కోర్సుల్లో భారత్ నెంబర్-2

టెక్నాలజీ అందుబాటులో లేక.. కరోనా కష్టకాలంలో భారత్ లోని 80శాతం మంది పిల్లలు అవస్థలు పడ్డారు. ఆన్ లైన్ విద్యకు దూరమై చదువులో వెనకబడ్డారు. దాదాపు 38శాతం కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక అవసరాలకోసం తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు వివిధ పనుల్లో కుదురుకున్నారు. వీరంతా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టినట్టే లెక్క. భారత్ లో పేద, ధనిక అంతరాలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం అనేది సర్వేల సారాంశం. అదే సమయంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా […]

ఆన్ లైన్ కోర్సుల్లో భారత్ నెంబర్-2
X

టెక్నాలజీ అందుబాటులో లేక.. కరోనా కష్టకాలంలో భారత్ లోని 80శాతం మంది పిల్లలు అవస్థలు పడ్డారు. ఆన్ లైన్ విద్యకు దూరమై చదువులో వెనకబడ్డారు. దాదాపు 38శాతం కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక అవసరాలకోసం తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు వివిధ పనుల్లో కుదురుకున్నారు. వీరంతా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టినట్టే లెక్క. భారత్ లో పేద, ధనిక అంతరాలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం అనేది సర్వేల సారాంశం. అదే సమయంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా భారత్ టాప్ ప్లేస్ లో ఉందని సర్వేలు చెబుతున్నాయి.

అమెరికా తర్వాత భారత్..
ప్రపంచవ్యాప్తంగా 2019 నాటికి ఆన్‌లైన్‌ విధానంలో వివిధ కోర్సులు నేర్చుకునేవారి సంఖ్య 4కోట్ల 40లక్షలు కాగా.. కరోనా ఉపద్రవం తర్వాత ఆ సంఖ్య 9కోట్ల 20లక్షలకు చేరుకుంది. ఆన్ లైన్ కోర్సులకు అంతగా డిమాండ్ పెరిగింది. అయితే ఈ కోర్సులు నేర్చుకునేవారిలో 3కోట్ల మందికి పైగా కేవలం అమెరికా, భారత్ లోనే ఉన్నారు. కోటీ 73లక్షలమంది అమెరికాలో ఆన్ లైన్ కోర్సులు నేర్చుకుంటుండగా భారత్ లో ఆ సంఖ్య కోటీ 36 లక్షలు. అంటే మొత్తం ఆన్ లైన్ అభ్యాసకుల్లో భారత్ వాటా 14.78 శాతం.

భారత్ లో టెక్నాలజీ అందుబాటులో ఉన్నవారి సంఖ్య తక్కువే అయినా.. అలా అందుబాటులో ఉన్నవారిలో ఎక్కువశాతం మంది దాన్ని చదువు విషయంలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏకంగా కోటీ 36 లక్షలమంది భారత విద్యార్థులు ఆన్ లైన్ లో వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వీటిలో 50శాతం ఫుల్ టైమ్ కోర్సులు కాగా, మిగతా 50శాతం పార్ట్ టైమ్ స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు. కరోనా సమయంలో భారత్ లోని యూనివర్శిటీలు కాలేజీలు మూతబడ్డాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ కోర్సులను అందించేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఖాళీ సమయంలో ఆయా సంస్థలు అందించే సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు యువత ఆసక్తి చూపించారు. కరోనా టైమ్ లో తమ సామర్థ్యాలను మరింత మెరుగుపరచుకున్నారు.

First Published:  15 Nov 2021 9:41 PM
Next Story