Telugu Global
Cinema & Entertainment

మాచర్లలో క్యాథరీన్ హంగామా

హీరో నితిన్ కొత్త సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో నితిన్ ను ఫుల్ యాక్షన్ మోడ్ లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయింది. తాజాగా క్యాథరీన్ థ్రెసాను సెకెండ్ హీరోయిన్ గా […]

catherine
X

హీరో నితిన్ కొత్త సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో నితిన్ ను ఫుల్ యాక్షన్ మోడ్ లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయింది. తాజాగా క్యాథరీన్ థ్రెసాను సెకెండ్ హీరోయిన్ గా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే క్యాథరీన్ థ్రెసా జాయిన్ అవుతుంది. క్యాథరీన్, నితిన్ కలిసి చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే.

నితిన్ ను ఇదివరకెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నాడు. భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్, నితిన్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.

First Published:  16 Nov 2021 2:04 PM IST
Next Story