మహారాష్ట్రలో అత్యంత దారుణం.. బాలికపై 400 మంది అత్యాచారం.. ఖాకీలూ వదల్లేదు..!
మహారాష్ట్రలో అత్యంత దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ బాలికపై ఏకంగా 400 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో పోలీసులు కూడా ఉండడం సంచలనం సృష్టిస్తోంది. సాయం చేస్తామని, ఉద్యోగం ఇప్పిస్తామని.. చెప్పి ఆరు నెలల పాటు 400 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మహారాష్ట్ర బీడ్ జిల్లాలో కూలి పనులు చేసుకునే దంపతులు తమ కుమార్తెను కొంత వరకు చదివించారు. రెండేళ్ల క్రితం బాలిక తల్లి మృతి […]
మహారాష్ట్రలో అత్యంత దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ బాలికపై ఏకంగా 400 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో పోలీసులు కూడా ఉండడం సంచలనం సృష్టిస్తోంది. సాయం చేస్తామని, ఉద్యోగం ఇప్పిస్తామని.. చెప్పి ఆరు నెలల పాటు 400 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
మహారాష్ట్ర బీడ్ జిల్లాలో కూలి పనులు చేసుకునే దంపతులు తమ కుమార్తెను కొంత వరకు చదివించారు. రెండేళ్ల క్రితం బాలిక తల్లి మృతి చెందడంతో తండ్రి కుమార్తెకు చిన్న వయసులోనే వివాహం జరిపించాడు. పెళ్ళై అత్తారింట అడుగుపెట్టిన ఆ బాలికకు అక్కడ వేధింపులు మొదలయ్యాయి. బాలికను మామ వేధించేవాడు. ఈ విషయాన్ని బాలిక తన భర్తకు చెప్పినా అతడు తన తండ్రికే మద్దతు ఇచ్చేవాడు.
అలా అత్త గారింట్లో బాలిక ఏడాదిన్నరపాటు కష్టాలు పడింది. ఆ తర్వాత ఆమె భర్త ఇంటిని వదిలి పుట్టింటికి చేరింది. నాన్నకు సహాయంగా ఉండాలని.. ఏదో ఒక పని చేయాలనుకుంది. పనుల కోసం ఆరు నెలల కిందట ఆమె అంబేజోగై పట్టణానికి వచ్చింది.
ఉద్యోగం కోసం తిరుగుతున్న ఆమెకి ఒక కోచింగ్ సెంటర్ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు.వారు పని ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా తమ స్నేహితులకు కూడా విషయం చెప్పారు. వారు కూడా బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అత్యాచారం చేశారు.
ఇలా ఆ బాలికను నమ్మిస్తూ ఆరు నెలల కాలంలో 400 మంది అత్యాచారం చేశారు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చింది. తాను మోసపోయానని నమ్మిన ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తనపై 400 వందల మంది అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. అక్కడ ఆమె బాధ విన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఎలాగైనా న్యాయం చేస్తామని చెప్పి ఆ బాలికను ఒక లాడ్జికి తీసుకెళ్లారు. బాలిక నమ్మి వారి వెంట వెళ్లగా కడుపుతో ఉన్న బాలికపై పోలీసులు అఘాత్యానికి పాల్పడ్డారు.
చివరికి ఆమె తనను ఆదుకోవాలని శిశుసంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది. బాలికకు జరిగిన అన్యాయాన్ని గురించి తెలుసుకున్న అధికారులు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ అంబేజోగై స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కూడా విచారణకు ఆదేశించారు.
బాలిక తెలియజేసిన ఆధారాల మేరకు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన తొమ్మిది మంది నిందితులను ఇప్పటిదాకా గుర్తించారు. వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక వయస్సు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.