Telugu Global
National

భారత్ లో పిల్లల టీకా ఇప్పట్లో లేనట్టే..

భారత్ లో పిల్లల టీకా అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది అనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. నీడిల్ లెస్ టీకా, సింగిల్ డోస్ టీకా అంటూ కొన్ని ప్రచారాలు జరిగాయి. జైడస్ క్యాడిలా కంపెనీకి దాదాపుగా అనుమతులొచ్చేశాయని అన్నారు, కొవాక్సిన్ పేరుతో పిల్లల టీకా కూడా తయారు చేసి పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. కానీ పిల్లల వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన […]

భారత్ లో పిల్లల టీకా ఇప్పట్లో లేనట్టే..
X

భారత్ లో పిల్లల టీకా అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది అనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. నీడిల్ లెస్ టీకా, సింగిల్ డోస్ టీకా అంటూ కొన్ని ప్రచారాలు జరిగాయి. జైడస్ క్యాడిలా కంపెనీకి దాదాపుగా అనుమతులొచ్చేశాయని అన్నారు, కొవాక్సిన్ పేరుతో పిల్లల టీకా కూడా తయారు చేసి పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. కానీ పిల్లల వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

పిల్లల వ్యాక్సిన్ కు తొందరెందుకు..?
చిన్న పిల్లల వ్యాక్సిన్ విషయంలో తొందరెందుకు అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ. కేవలం కొన్నిదేశాల్లో మాత్రే, అదీ పరిమితంగానే చిన్నారులకు వ్యాక్సిన్లు ఇస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడా పెద్ద ఎత్తున చిన్నారులకు వ్యాక్సిన్లు ఇచ్చిన ఉదాహరణలు లేవని చెప్పారాయన. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటున్న ఆయన.. తొందరపడటం కంటే, జాగ్రత్తపడటం మేలని వివరించారు.

భారత్ లో చిన్నపిల్లల వ్యాక్సిన్ పై సమగ్ర చర్చ అవసరం అని అన్నారు కేంద్ర మంత్రి. కొవిడ్ ఇప్పుడప్పుడే అంతం కాదని, పెద్దలు, పిల్లలు అందరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్త వహించాలని కోరారు. ఇప్పటికే హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం పేరుతో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నామని వివరించారు. 100కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ పూర్తయిందంటూ ఆమధ్య భారత్ లో సంబరాలు జరిగినా.. చాలా రాష్ట్రాల్లో అర్హులైన వారికి సింగిల్ డోస్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. ఈ నేపథ్యంలో ముందు వయోజనుల టీకాలపై కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని, ఆ తర్వాత చిన్నారుల టీకాల గురించి ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. మరోవైపు కరోనా ఉధృతి కూడా తగ్గడంతో చిన్నారుల టీకాలపై పెద్దగా చర్చ జరగడంలేదు. అందుకే ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.

First Published:  14 Nov 2021 3:31 AM IST
Next Story