Telugu Global
Cinema & Entertainment

నిఖిల్ సినిమా రెడీ అవుతోంది!

అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణలో నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా తెరకెక్కుతున్న సినిమా 18 పేజెస్. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాకు కథ అందించగా.. ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. జీఏ2పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్ప‌టికే విడుద‌లైన 18 పేజెస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లకు […]

నిఖిల్ సినిమా రెడీ అవుతోంది!
X

అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణలో నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా తెరకెక్కుతున్న సినిమా 18 పేజెస్. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాకు కథ అందించగా.. ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. జీఏ2పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్ప‌టికే విడుద‌లైన 18 పేజెస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో 18 పేజెస్ విడుద‌ల తేదిని నిర్మాత బ‌న్నీ వాసు గ్రాండ్ గా ప్ర‌క‌టించాడు.

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కుమారి 21ఎఫ్ తో యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ 18 పేజీస్ ని కూడా అంతే వినూత్నంగా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిస్తున్నాడు. న‌వీన్ నూలీ ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్య‌వ‌హరిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి లిరికల్ వీడియోస్ రిలీజ్ కాబోతున్నాయి.

First Published:  14 Nov 2021 8:42 AM IST
Next Story