Telugu Global
Cinema & Entertainment

రాధేశ్యామ్ నుంచి ఎట్టకేలకు అప్ డేట్

నిన్న రాధేశ్యామ్ నిర్మాతలు యూవీ క్రియేషన్స్ పేరిట ఓ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలోకి వచ్చింది. రాధేశ్యామ్ అప్ డేట్ కోసం చాన్నాళ్లు ఎదురుచూసిన ప్రభాస్ అభిమాని ఒకడు, యూవీ క్రియేషన్స్ నిర్మాతలపై నిరసనగా సూసైడ్ లెటర్ రాశాడు. తన ఆత్మహత్యకు నిర్మాతలు, దర్శకుడే బాధ్యత వహించాలని అందులో క్లియర్ గా రాశాడు. అభిమానుల మనోభావాలో ఆడుకోవద్దని చిన్న సూచన కూడా చేశాడు. అలా సూసైడ్ లెటర్ సంచలనంగా మారిన కొన్ని గంటలకే యూవీ క్రియేషన్స్ నుంచి […]

రాధేశ్యామ్ నుంచి ఎట్టకేలకు అప్ డేట్
X

నిన్న రాధేశ్యామ్ నిర్మాతలు యూవీ క్రియేషన్స్ పేరిట ఓ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలోకి వచ్చింది. రాధేశ్యామ్ అప్ డేట్ కోసం చాన్నాళ్లు ఎదురుచూసిన ప్రభాస్ అభిమాని ఒకడు, యూవీ క్రియేషన్స్ నిర్మాతలపై నిరసనగా సూసైడ్ లెటర్ రాశాడు. తన ఆత్మహత్యకు నిర్మాతలు, దర్శకుడే బాధ్యత వహించాలని అందులో క్లియర్ గా రాశాడు. అభిమానుల మనోభావాలో ఆడుకోవద్దని చిన్న సూచన కూడా చేశాడు. అలా సూసైడ్ లెటర్ సంచలనంగా మారిన కొన్ని గంటలకే యూవీ క్రియేషన్స్ నుంచి అప్ డేట్ వచ్చింది.

రాధేశ్యామ్ సినిమా నుంచి తొలి సింగిల్ రిలీజ్ కాబోతోంది. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆ పాటను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నీళ్లలో మునిగిపోతున్న కారు ఫోటోను ఆ పోస్టర్ లో చూడొచ్చు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రభాస్ క్యారెక్టర్ టీజర్ రిలీజైంది. యూట్యూబ్ లో అది పెద్ద సంచలనమైంది. ఇప్పుడు సాంగ్ కూడా అదే రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందంటున్నారు మేకర్స్

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ వెటరన్ నటి భాగ్యశ్రీ నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలకు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ మ్యూజిక్ అందించగా.. హిందీ వెర్షన్ కు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీత దర్శకులుగా పనిచేశారు. జనవరి 14, 2022న థియేటర్లలోకి రానుంది రాధేశ్యామ్.

First Published:  13 Nov 2021 1:43 PM IST
Next Story