నితిన్ కొత్త సినిమా విడుదల తేదీ ఫిక్స్
డిఫరెంట్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటున్నాడు నితిన్. ఇందులో భాగంగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నాడు నితిన్. ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తోశ్రేష్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న […]
డిఫరెంట్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటున్నాడు నితిన్. ఇందులో భాగంగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నాడు నితిన్. ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తోశ్రేష్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుందని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. తన మీదకు దాడి చేసేందుకు వస్తున్న వారిపై నితిన్ విరుచుకుపడుతుండడం ఈ పోస్టర్లో చూడొచ్చు. మొత్తానికి ఇలా అందరికంటే ముందే వచ్చే వేసవిని క్యాష్ చేసుకునే ప్లాన్ వేశాడు నితిన్.
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు హైలెట్ కానున్నాయి. కృతి శెట్టి నితిన్ ప్రేమ కథ కూడా కొత్తగా ఉండబోతోంది. భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి నితిన్ సినిమాకు సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నాడు మహతి స్వరసాగర్.