Telugu Global
Cinema & Entertainment

చక్కగా సమర్థించుకున్న కార్తికేయ

సినిమా సక్సెస్ అయినప్పుడు సక్సెస్ మీట్ పెట్టడం కామన్. అందులో పెద్ద కిక్ కూడా ఉండదు. కానీ నెగెటివ్ టాక్ వచ్చినప్పుడు కూడా సక్సెస్ మీట్ పెట్టి, ఆ మీటింగ్ లో సినిమాను సమర్థిస్తూ మాట్లాడ్డం ఓ కళ. తాజాగా హీరో కార్తికేయ ఆ కళను ప్రదర్శించాడు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న తన సినిమాను సమర్థించుకున్నాడు. ఈ క్రమంలో ఏకంగా బాహుబలితో రాజా విక్రమార్కను పోల్చాడు. “ఉదయం నుంచి నాకు పాజిటివ్ మెసేజ్ లు వచ్చాయి. ‘ఆర్ఎక్స్ […]

చక్కగా సమర్థించుకున్న కార్తికేయ
X

సినిమా సక్సెస్ అయినప్పుడు సక్సెస్ మీట్ పెట్టడం కామన్. అందులో పెద్ద కిక్ కూడా ఉండదు. కానీ నెగెటివ్ టాక్ వచ్చినప్పుడు కూడా సక్సెస్ మీట్ పెట్టి, ఆ మీటింగ్ లో సినిమాను సమర్థిస్తూ మాట్లాడ్డం ఓ కళ. తాజాగా హీరో కార్తికేయ ఆ కళను ప్రదర్శించాడు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న తన సినిమాను సమర్థించుకున్నాడు. ఈ క్రమంలో ఏకంగా బాహుబలితో రాజా విక్రమార్కను పోల్చాడు.

“ఉదయం నుంచి నాకు పాజిటివ్ మెసేజ్ లు వచ్చాయి. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత విడుదలైన సినిమాల్లో ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ‘రాజా విక్రమార్క’కు వచ్చింది. మనం నమ్మినది జరిగితే మనకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నిన్న ఉదయం నుంచి నాకు ఉంది. మనందరం థియేటర్లకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసే అర్హత ఉన్న సినిమా తీశాం. అది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. సినిమాలో అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. బాహుబలి లాంటి సినిమాలోనే లోపాలు చూశాం. మా సినిమాలో కూడా అలాంటివి ఉండొచ్చు. కానీ థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడ్ని మాత్రం మా రాజావిక్రమార్క నిరాశపరచదు.”

ఇలా తన సినిమాను దిగ్విజయంగా వెనకేసుకొచ్చాడు విక్రమార్క. ఈ సినిమాకు మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చింది. చాలా సమీక్షల్లో నెగెటివ్ పాయింట్లే ఎక్కువగా కనిపించాయి. అలా రాసిన రివ్యూస్ అన్నింటినీ మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని తెలిపిన కార్తికేయ.. తన దర్శకుడు శ్రీ సరిపల్లిపై రివ్యూ రాసేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి రాయమని కోరుతున్నాడు. సరిపల్లిపై తనకు పూర్తి నమ్మకం ఉందని, రాబోయే రోజుల్లో మంచి డైరక్టర్ అవుతాడని, అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎక్కువ నెగెటివ్ గా రాయొద్దని సమీక్షకుల్ని కోరాడు.

First Published:  13 Nov 2021 1:45 PM IST
Next Story