Telugu Global
NEWS

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు..

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. లిస్ట్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 8 జిల్లాలనుంచి 11 స్థానాలకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. విజయనగరం జిల్లానుంచి రఘురాజు, విశాఖపట్నం నుంచి ఒరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత బాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌, మొండితోక […]

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు..
X

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. లిస్ట్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 8 జిల్లాలనుంచి 11 స్థానాలకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది.

విజయనగరం జిల్లానుంచి రఘురాజు, విశాఖపట్నం నుంచి ఒరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత బాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌, మొండితోక అరుణ్ కుమార్‌, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు, అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గ ఇన్ చార్జ్ భరత్‌ ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైసీపీ ఖరారు చేసింది.

ఇక ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇదివరకే వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. డీసీ గోవిందరెడ్డి, ఇషాక్ భాషా, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు.

ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాతో కలిపి మొత్తం ఎన్నికలు జరగాల్సిన 14 ఎమ్మెల్సీ సీట్లలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు, ఓసీలకు 7 స్థానాల్లో అవకాశం కల్పించినట్టు వివరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. సామాజిక సమీకరణ వల్ల కొందరు సీనియర్లు వేచి చూడాల్సి వస్తోందని, అయితే పార్టీలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు ముందు అందరికీ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. ఇదే ఆఖరు అనుకోవద్దని, చాలా అవకాశాలున్నాయని ఆశావహులు అర్థం చేసుకోవాలని కోరారు.

First Published:  12 Nov 2021 1:37 PM IST
Next Story