ఆర్జీవీ నుంచి పాన్ ఇండియా మూవీ
చకచకా సినిమాలు చేసి రిలీజ్ చేయడం రామ్ గోపాల్ వర్మ స్టయిల్. తనకు థియేటర్లు దొరక్కపోతే నేరుగా ఆన్ లైన్ లో సినిమా రిలీజ్ చేస్తుంటాడు ఈ డైరక్టర్. దీని కోసం ప్రత్యేకంగా ఓ ఓటీటీ వేదికను కూడా ఏర్పాటుచేసుకున్నాడు. ఇలాంటి దర్శకుడి నుంచి ఇప్పుడో పాన్ ఇండియా సినిమా వస్తోంది. నిజానికి దీన్ని పాన్ ఇండియా సినిమా అనే కంటే, పాన్ వరల్డ్ సినిమా అనడం కరెక్ట్. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ […]
చకచకా సినిమాలు చేసి రిలీజ్ చేయడం రామ్ గోపాల్ వర్మ స్టయిల్. తనకు థియేటర్లు దొరక్కపోతే నేరుగా ఆన్ లైన్ లో సినిమా రిలీజ్ చేస్తుంటాడు ఈ డైరక్టర్. దీని కోసం ప్రత్యేకంగా ఓ ఓటీటీ వేదికను కూడా ఏర్పాటుచేసుకున్నాడు. ఇలాంటి దర్శకుడి నుంచి ఇప్పుడో పాన్ ఇండియా సినిమా వస్తోంది. నిజానికి దీన్ని పాన్ ఇండియా సినిమా అనే కంటే, పాన్ వరల్డ్ సినిమా అనడం కరెక్ట్.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా లడకి. ఓ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ ను ఎలా తన జీవితంలో భాగంగా చేసుకుంది, దాని సహాయంతో ఎలా ఉన్నత శిఖరాల్ని అధిరోహించింది లాంటి అంశాల్ని ఇందులో చూపించారు.
ఈ సినిమా హిందీతో పాటు చైనా భాషలో కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. చైనా లో “డ్రాగన్ గర్ల్” టైటిల్ తో విడుదల చేస్తారు. ఆర్ట్ సి మీడియా, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించారు. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రానికి లడకి చిత్రం నివాళి అంటున్నాడు వర్మ.
మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు పూజ భలేకర్, లడకి చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. తన ఫైటింగ్ స్కిల్స్ తో హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న విడుదల చేస్తున్నారు. ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇది రిలీజ్ అవుతుంది.
నవంబర్ 27న బ్రూస్ లీ 81వ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో లడకి ది డ్రాగన్ గర్ల్ మొదటి పోస్టర్ ను విడుదల చేస్తారు. అలాగే చైనా లో ని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ 81వ పుట్టిన రోజు సందర్భంగా డ్రాగన్ గర్ల్ చిత్రాన్ని ప్రీమియర్ గా ప్రదర్శించబోతున్నారు.