Telugu Global
Cinema & Entertainment

ప్రభుదేవా, రెజీనా, అనసూయ సినిమా

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఫ్లాష్ బ్యాక్’. ”గుర్తుకొస్తున్నాయి” అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన […]

ప్రభుదేవా, రెజీనా, అనసూయ సినిమా
X

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఫ్లాష్ బ్యాక్’. ”గుర్తుకొస్తున్నాయి” అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు.

ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్‌ ఉంటాయంటున్నారు నిర్మాతలు. ఫ్లాష్ బ్యాక్ అనే టైటిల్ కథకు సరిగ్గా సూట్ అయిందని.. సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. చిత్రంలో యంగ్ హీరోయిన్ రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా.. అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి రోల్స్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలవనున్నాయి. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్.

సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తాజాగా అనసూయ, తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేసింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీకి నందు దుర్లపాటి మాటలు రాశారు. సరికొత్త పాయింట్‌తో వస్తున్న ఈ సినిమాను అతి త్వరలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  10 Nov 2021 1:45 PM IST
Next Story