తన బాడీపై స్పందించిన హీరో
టాలీవుడ్ లో పెర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేసే అతికొద్ది మంది హీరోల్లో కార్తికేయ ఒకడు. మరి ఇంత శ్రద్ధగా శరీరధారుఢ్యాన్ని మెయింటైన్ చేస్తున్న కార్తికేయకు అది ఏమైనా ప్లస్ అయిందా? అతడి బాడీ చూసి సినిమా ఆవకాశాలు వస్తున్నాయా? దీనిపై స్పందించాడు ఈ యంగ్ హీరో. “నా బాడీ, ఫిజిక్ వల్లే ఆర్ఎక్స్ 100 సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా టైమ్ లో నేను మీకు ఎలా తెలుసు? నేను యాక్టింగ్ చేస్తానని ఎలా […]
టాలీవుడ్ లో పెర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేసే అతికొద్ది మంది హీరోల్లో కార్తికేయ ఒకడు. మరి ఇంత శ్రద్ధగా శరీరధారుఢ్యాన్ని మెయింటైన్ చేస్తున్న కార్తికేయకు అది ఏమైనా ప్లస్ అయిందా? అతడి బాడీ చూసి సినిమా ఆవకాశాలు వస్తున్నాయా? దీనిపై స్పందించాడు ఈ యంగ్ హీరో.
“నా బాడీ, ఫిజిక్ వల్లే ఆర్ఎక్స్ 100 సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా టైమ్ లో నేను మీకు ఎలా తెలుసు? నేను యాక్టింగ్ చేస్తానని ఎలా తెలుసు అని అజయ్ భూపతిని అడిగాను. అవన్నీ నాకు తెలియదు. నీకు మంచి బాడీ ఉందని తీసుకున్నాను. యాక్టింగ్ నేను చేయించుకుంటాను అన్నాడు. తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమా టైమ్ లో దర్శకుడు విక్రమ్ కుమార్‌తో ‘నన్ను ఎందుకు తీసుకున్నారు?’ అని అడిగా. ‘నీకు మంచి బాడీ ఉంది’ అన్నారు విక్రమ్ కుమార్. ఇప్పుడు అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమైలో కూడా విలన్ గా నన్ను అందుకే తీసుకున్నారు. బాడీ వల్ల నాకు చాలా ఛాన్సులు వచ్చాయి. దర్శకులు నన్ను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏదైనా అవ్వొచ్చు. బాడీ ఉందని నన్ను తీసుకున్నానని చెప్పిన ముగ్గురు దర్శకులు… నా నటన చూసినప్పుడు, ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు, నటనలో ఇంటెన్స్ చూసి సర్‌ప్రైజ్ అయ్యామని చెప్పారు. ఫిజిక్ ఉండటం నాకు అడ్వాంటేజ్ అయ్యింది. దాని వల్ల రోల్స్ వచ్చాయి.”
ఇలా తనకు తన బాడీనే అవకాశాలు తెచ్చిపెడుతున్న విషయాన్ని బయటపెట్టాడు కార్తికేయ. తన ఫిజిక్ వల్ల అవకాశాలు వస్తున్నప్పుడు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే బాడీని మెయింటైన్ చేయడం కోసం చాలా కష్టపడతానని చెప్పుకొచ్చాడు.