భోళాశంకర్.. క్రేజీ అప్ డేట్
చిరంజీవి అస్సలు తగ్గట్లేదు. సినిమా ఓపెనింగ్ రోజునే లుక్ కూడా రిలీజ్ చేసి తన జోరు చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తన కొత్త సినిమాకు సంబంధించి కూడా ఓపెనింగ్ రోజునే లుక్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెలుగులో భోళాశంకర్ చేయబోతున్నారు. ఈ మూవీ రేపు పూజాకార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. కేవలం పూజ […]
చిరంజీవి అస్సలు తగ్గట్లేదు. సినిమా ఓపెనింగ్ రోజునే లుక్ కూడా రిలీజ్ చేసి తన జోరు చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తన కొత్త సినిమాకు సంబంధించి కూడా ఓపెనింగ్ రోజునే లుక్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే భోళాశంకర్.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెలుగులో భోళాశంకర్ చేయబోతున్నారు. ఈ మూవీ రేపు పూజాకార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. కేవలం పూజ చేసి, క్లాప్ కొట్టి వదిలేయకుండా.. ఓపెనింగ్ రోజునే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు చిరంజీవి.
ఈ ఫస్ట్ లుక్ కు సంబంధించి 2 రోజుల కిందట చిరంజీవిపై ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించారు. ఆ ప్రత్యేకమైన లుక్ ను రేపు పూజాకార్యక్రమాలతో పాటు విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్న పేరును ఆల్రెడీ ఫిక్స్ చేయడంతో పాటు అధికారికంగా ప్రకటించారు. సైరా తర్వాత చిరంజీవితో కలిసి తమన్న చేస్తున్న రెండో ప్రాజెక్టు ఇది.
అనీల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేష్ నటించనుంది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.