Telugu Global
National

సరిహద్దు బంకుల్లో సందడే సందడి..

కేంద్రం పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కర్నాటక రేట్లు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ రేటు 12 రూపాయలు, డీజిల్ రేటు 17 రూపాయల మేర తగ్గింది. అయితే కర్నాటక సరిహద్దు రాష్ట్రాల్లో తగ్గింపు అమలులోకి రాకపోవడంతో ఆయా రాష్ట్రాలకు దగ్గర్లో ఉన్న కర్నాటక పెట్రోల్ బంకులకు డిమాండ్ బాగా పెరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కర్నాటక సరిహద్దుల్లో […]

సరిహద్దు బంకుల్లో సందడే సందడి..
X

కేంద్రం పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కర్నాటక రేట్లు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ రేటు 12 రూపాయలు, డీజిల్ రేటు 17 రూపాయల మేర తగ్గింది. అయితే కర్నాటక సరిహద్దు రాష్ట్రాల్లో తగ్గింపు అమలులోకి రాకపోవడంతో ఆయా రాష్ట్రాలకు దగ్గర్లో ఉన్న కర్నాటక పెట్రోల్ బంకులకు డిమాండ్ బాగా పెరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కర్నాటక సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. సగానికి సగం డిమాండ్ పడిపోయిందని చెబుతున్నారు నిర్వాహకులు.

2వేల కోట్లు నష్టం.. కానీ..
కర్నాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై స్థానిక పన్నులు తగ్గించడం వల్ల 2వేల కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశముంది. అయితే ఆమేర సరిహద్దు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అమ్మకాలు భారీగా పెరిగిపోవడంతో ఆ నష్టం భర్తీ అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కర్నాటక వ్యాప్తంగా 6500 పెట్రోల్ బంకులు ఉండగా.. వాటిలో 300 బంకులు ఇతర రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ రోజువారీ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇక్కడ పెట్రోల్ తీసుకెళ్లి.. రాష్ట్రం దాటిన తర్వాత ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఈ వ్యాపారం ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.

కర్నాటక సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో గతంలో రోజుకి 2వేల లీటర్ల ఇంధనం అమ్ముడవుతుండగా ఇప్పుడు అది 10వేల లీటర్లకు చేరింది. ఇతర రాష్ట్రాల్లో ధరలు తగ్గకపోతే.. 20వేల లీటర్లకు పైగా అమ్మకాలు సాగుతాయనే అంచనా ఉంది. మొత్తమ్మీద పెట్రోల్ రేట్లలో రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండటంతో అంతర్ రాష్ట్ర ప్రయాణాలు చేసే వాహనాలు సరిహద్దుల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకుని వస్తున్నాయి. దీంతో పెట్రోల్ రేట్లపై స్థానిక పన్నులు తగ్గించని రాష్ట్రాల్లో అమ్మకాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.

First Published:  7 Nov 2021 7:44 AM IST
Next Story