Telugu Global
National

సిగరెట్ తాగడం.. ఢిల్లీలో ఉండటం ఒకటే..

ఢిల్లీలో నివశించడం అంటే.. రోజుకి ఓ సిగరెట్ తాగినట్టేనని అంటున్నారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. పొగ తాగితే ఊపిరితిత్తులపై ఎలాంటి దుష్ప్రభావాలుంటాయో.. ఢిల్లీలో నివశించేవారికి ఆ అలవాటు లేకపోయినా అంతటి ప్రభావం కనిపిస్తుందని తేల్చి చెప్పారు. ఢిల్లీలో సగటు జీవన ప్రమాణం తగ్గిపోతోందని, కాలుష్యం కాటుకి ఢిల్లీ వాసులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలపై సర్వేలు ఆందోళనకర విషయాలను బయటపెడుతున్నాయని చెప్పిన ఆయన.. ఢిల్లీ వాసుల ఊపిరితిత్తులు మసిబారిపోతున్నాయని […]

సిగరెట్ తాగడం.. ఢిల్లీలో ఉండటం ఒకటే..
X

ఢిల్లీలో నివశించడం అంటే.. రోజుకి ఓ సిగరెట్ తాగినట్టేనని అంటున్నారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. పొగ తాగితే ఊపిరితిత్తులపై ఎలాంటి దుష్ప్రభావాలుంటాయో.. ఢిల్లీలో నివశించేవారికి ఆ అలవాటు లేకపోయినా అంతటి ప్రభావం కనిపిస్తుందని తేల్చి చెప్పారు. ఢిల్లీలో సగటు జీవన ప్రమాణం తగ్గిపోతోందని, కాలుష్యం కాటుకి ఢిల్లీ వాసులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలపై సర్వేలు ఆందోళనకర విషయాలను బయటపెడుతున్నాయని చెప్పిన ఆయన.. ఢిల్లీ వాసుల ఊపిరితిత్తులు మసిబారిపోతున్నాయని హెచ్చరించారు.

వాహనాల పొగతోపాటు, దీపావళి బాణసంచా కాల్పుల ప్రభావంతో పండగ సీజన్లో వాతావరణ కాలుష్యం భారీగా పెరిగింది. కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొవిడ్ తీవ్రత కూడా పెరుగుతుందని అన్నారు రణదీప్ గులేరియా. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదని, చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా దాని ప్రభావం ఉంటుందని తెలిపారు. 2017 తర్వాత అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ఏడాది 2021 అని సర్వేలు చెబుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) రిపోర్ట్ లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉన్న సమయంలో మాత్రమే ఢిల్లీలో కాలుష్యం శాతం తగ్గిందని, ఇక అది ఎప్పటికీ సాధారణ స్థాయికి రాదని అంటున్నారు ఢిల్లీలోని ప్రముఖ ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్ అరునేష్ కుమార్.

బాలబాలికలకు తీవ్ర సమస్యలు..
ఢిల్లీలో 10 నుంచి 15 శాతం మంది చిన్నారులు ఆస్తమాతో బాధపడుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ సర్వేల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రభావ రాజధానిగా ఢిల్లీ రికార్డుల్లోకెక్కింది. అయితే ఢిల్లీ వాసులు మాత్రం ఇవేవీ లెక్క చేస్తున్నట్టు కనిపించడంలేదు. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నా.. యథేచ్ఛగా దీపావళి సంబరాల్లో మునిగితేలారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు.

First Published:  7 Nov 2021 3:47 AM IST
Next Story