Telugu Global
Cinema & Entertainment

స్కైల్యాబ్ ట్రయిలర్ రివ్యూ

బండ లింగ‌ప‌ల్లిలో గౌరి(నిత్యా మీన‌న్‌) ఓ ధ‌నవంతురాలి బిడ్డ‌. కానీ జ‌ర్న‌లిస్ట్ కావాల‌నే కోరిక‌తో ప్ర‌తిబింబం పత్రిక‌కు వార్త‌లు సేక‌రించి రాస్తుంటుంది. డాక్ట‌ర్‌ ఆనంద్‌(స‌త్య‌దేవ్‌) త‌న గ్రామంలో హాస్పిట‌ల్ పెట్టాల‌నుకుంటాడు. అయితే త‌న‌కు కాస్త స్వార్థం. త‌న ప‌ని పూర్త‌యితే చాలు అనుకునే ర‌కం. ఎప్పుడూ డ‌బ్బు గురించే ఆలోచిస్తుంటాడు. వీరితో పాటు సుబేదార్ రామారావు జ‌త క‌లుస్తాడు. వీరి జీవితాల్లో ఏదో ర‌కంగా సాగుతుంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో స‌మ‌స్య. మ‌రి వారి స‌మ‌స్య‌లు తీరాలంటే ఏదైనా […]

స్కైల్యాబ్ ట్రయిలర్ రివ్యూ
X

బండ లింగ‌ప‌ల్లిలో గౌరి(నిత్యా మీన‌న్‌) ఓ ధ‌నవంతురాలి బిడ్డ‌. కానీ జ‌ర్న‌లిస్ట్ కావాల‌నే కోరిక‌తో ప్ర‌తిబింబం పత్రిక‌కు వార్త‌లు సేక‌రించి రాస్తుంటుంది. డాక్ట‌ర్‌ ఆనంద్‌(స‌త్య‌దేవ్‌) త‌న గ్రామంలో హాస్పిట‌ల్ పెట్టాల‌నుకుంటాడు. అయితే త‌న‌కు కాస్త స్వార్థం. త‌న ప‌ని పూర్త‌యితే చాలు అనుకునే ర‌కం. ఎప్పుడూ డ‌బ్బు గురించే ఆలోచిస్తుంటాడు. వీరితో పాటు సుబేదార్ రామారావు జ‌త క‌లుస్తాడు. వీరి జీవితాల్లో ఏదో ర‌కంగా సాగుతుంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో స‌మ‌స్య. మ‌రి వారి స‌మ‌స్య‌లు తీరాలంటే ఏదైనా అద్భుతం జర‌గాల‌ని అనుకుంటారు.

అదే స‌మ‌యంలో అంత‌రిక్షంలో ప్ర‌వేశపెట్టిన ఉప‌గ్ర‌హం స్కైలాబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి పెను ప్ర‌మాదం వాటిల్ల‌బోతుంద‌ని రేడియోలో వార్త వినిపిస్తుంది. అది నేరుగా బండ లింగ‌ప‌ల్లిలోనే ప‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తారు. అప్పుడు అంద‌రి జీవితాల్లో ఎలాంటి మార్పులు వ‌స్తాయి. అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ‘స్కై లాబ్‌’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈరోజు రిలీజైన ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. డిసెంబ‌ర్ 4న సినిమా విడుద‌ల‌వుతుంది.

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిత్యామీనన్ కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. కథ నచ్చి ఆమె నిర్మాతగా మారింది. 1979 బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ మూవీ ఇది.

First Published:  6 Nov 2021 12:16 PM IST
Next Story