Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా స్టార్ట్ చేసిన చిరంజీవి

చిరంజీవి, బాబి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఇప్పుడా సినిమా మొదలైంది. ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమా ఇది. లాంఛింగ్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మాస్ అండ్ ర‌గ్డ్ అవ‌తారంలో చిరంజీవి మూల విరాట్ ని చూసి అందరూ ఫిదా అయ్యారు. క్షణాల్లో ఆ […]

మరో సినిమా స్టార్ట్ చేసిన చిరంజీవి
X

చిరంజీవి, బాబి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఇప్పుడా సినిమా మొదలైంది. ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమా ఇది.

లాంఛింగ్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మాస్ అండ్ ర‌గ్డ్ అవ‌తారంలో చిరంజీవి మూల విరాట్ ని చూసి అందరూ ఫిదా అయ్యారు. క్షణాల్లో ఆ పోస్టర్ వైరల్ అయింది. ఇక పూజా కార్యక్రమాల విషయానికొస్తే.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, వివి వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, ఛార్మీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, బీవీఎస్ రవి, నాగబాబు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

మొదటి షాట్‌కు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా.. పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, బుచ్చి బాబు, శివ నిర్వాణ ఇలా అందరూ కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ముహూర్తపు షాట్‌కు ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు గౌర‌వ దర్శకత్వం వహించారు.

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, ఆర్థర్ ఏ విల్సన్ కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. సుష్మిత కొణిదెల క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

First Published:  6 Nov 2021 12:19 PM IST
Next Story