కార్తికేయ స్వీట్ అంటున్న హీరోయిన్
రాజా విక్రమార్క సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. తమిళ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో తన తొలి సినిమా అనుభవాల్ని పంచుకుంది. మరీ ముఖ్యంగా తన తొలి తెలుగు హీరో కార్తికేయ చాలా స్వీట్ అని చెప్పుకొచ్చింది. “కార్తికేయ చాలా స్వీట్. మంచి ఫ్రెండ్లీ పర్సన్. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బావుంది. […]
రాజా విక్రమార్క సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. తమిళ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో తన తొలి సినిమా అనుభవాల్ని పంచుకుంది. మరీ ముఖ్యంగా తన తొలి తెలుగు హీరో కార్తికేయ చాలా స్వీట్ అని చెప్పుకొచ్చింది.
“కార్తికేయ చాలా స్వీట్. మంచి ఫ్రెండ్లీ పర్సన్. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బావుంది. అతనితో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణి లాంటి సీనియర్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.”
తాన్య తాతయ్య రవిచంద్రన్, కోలీవుడ్ లో ఒకప్పుడు హీరో. అలా సినీ వాతావరణంలోనే పుట్టి పెరిగిన తాన్యా, కాస్త ఆలస్యంగా గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చింది. దీనికి ఆమె ఓ కారణం కూడా చెబుతోంది.
“చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. ‘ముందు పీజీ పూర్తి చెయ్. తర్వాత సినిమాలు చేయొచ్చు’ అని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పను. అయితే… వరుస అవకాశాలు రావడంతో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక… ఎంఏ హెచ్ఆర్ లో పీజీ కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.”
తను సినిమాల్లోకి రాకముందే తాత రవిచంద్రన్ మరణించారని, ఆ లోటు జీవితంలో భర్తీ చేయలేనిదని అంటోంది తాన్యా.