బాలయ్య సరసన శృతిహాసన్ ఫిక్స్
నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశాడు. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేసినట్టు తాజాగా […]

నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశాడు.
బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేసినట్టు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. గోపీచంద్ మలినేనితో ఇది మూడో సినిమా కాగా..బాలకృష్ణతో శృతిహాసన్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. నిజానికి బాలయ్య సరసన శృతి అంటూ ఇప్పటికే కథనాలు వచ్చేశాయి. ఈ మేటర్ ను ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించారంతే.
పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నాడు.