Telugu Global
Cinema & Entertainment

రావణాసురుడిగా మారిన రవితేజ

రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, ఈరోజు ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పనిలోపనిగా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. రవితేజ కెరీర్ లో 70వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రానికి రావణాసుర అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఇందులో పది రకాల విభిన్న పాత్రలను రవితేజ పోషించబోతోన్నట్టు తెలుస్తోంది. టైటిల్ […]

రావణాసురుడిగా మారిన రవితేజ
X

రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, ఈరోజు ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పనిలోపనిగా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు.

రవితేజ కెరీర్ లో 70వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రానికి రావణాసుర అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఇందులో పది రకాల విభిన్న పాత్రలను రవితేజ పోషించబోతోన్నట్టు తెలుస్తోంది. టైటిల్ బట్టి చూస్తే, సినిమాలో రవితేజ అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపించే అవకాశం ఉంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ దశావతారాల్లో కనిపిస్తున్నారు. పది తలల రావణాసురుడిలా ఉన్నారు. లాయర్ కోర్టు ధరించి సుత్తి పట్టుకుని కూర్చున్నాడు. రక్తం కారుతూ రవితేజ అలా సీరియస్‌గా కూర్చుని ఉండటం చూస్తే కథ మీద ఆసక్తి పెరిగేలా ఉంది. గన్స్ కూడా ఆ పోస్టర్లో కనిపిస్తున్నాయి. హీరోలు అనేవాళ్లు ఉండరు అని పోస్టర్ మీద రాసి ఉంది. అలా ఈ ఒక్క పోస్టర్‌తోనే అందరిలోనూ అంచనాలు పెంచేసింది. రావణాసుర సినిమా. సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.

First Published:  5 Nov 2021 12:58 PM IST
Next Story