Telugu Global
National

హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా..

త్వరలో భారత్ లో కూడా డోర్ టు డోర్ వ్యాక్సిన్ కార్యక్రమం మొదలు కాబోతోంది. ఇప్పటికే వందకోట్ల మార్కు దాటామని చెప్పుకుంటున్న కేంద్రం.. ఇకపై ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే విధానంపై దృష్టిపెడుతోంది. ఇందులో భాగంగా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రతి ఇంటికీ వెెళ్లి టీకాలు వేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని సూచించారు. 50 శాతం కూడా వ్యాక్సినేషన్ పూర్తికాని రాష్ట్రాలు దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు […]

హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా..
X

త్వరలో భారత్ లో కూడా డోర్ టు డోర్ వ్యాక్సిన్ కార్యక్రమం మొదలు కాబోతోంది. ఇప్పటికే వందకోట్ల మార్కు దాటామని చెప్పుకుంటున్న కేంద్రం.. ఇకపై ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే విధానంపై దృష్టిపెడుతోంది. ఇందులో భాగంగా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రతి ఇంటికీ వెెళ్లి టీకాలు వేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని సూచించారు. 50 శాతం కూడా వ్యాక్సినేషన్ పూర్తికాని రాష్ట్రాలు దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు మోదీ.

జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఇంకా జోరందుకోలేదు. 50శాతం కూడా చేరుకోలేదు. అందులోనూ ఆయా రాష్ట్రాల్లోని 40 జిల్లాల్లో టీకా పంపిణీ మరీ నత్తనడకన సాగుతోంది. దీంతో ప్రత్యేకంగా ప్రధాని నరేంద్రమోదీ.. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇంటింటికీ టీకా పంపిణీ చేయాలని సూచించారు.

ప్రతి ఇంటి తలుపు తట్టండి..
ఇప్పటి వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీ జరిగేది, ప్రత్యేక క్యాంప్ లు ఏర్పాటు చేసి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. గతంలో వృద్ధులు, ఇల్లు దాటి బయటకు రాలేని వారికి మాత్రమే ఇంటికి వెళ్లి టీకా ఇచ్చే వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఇంటి తలుపు తట్టి, టీకా వేయించుకోనివారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచిస్తున్నారు. హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా.. అనే పేరుతో దీన్ని మొదలు పెట్టబోతున్నారు. ముందుగా వ్యాక్సినేషన్లో అట్టడుగున ఉన్న జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇటీవలే టీకాల కొనుగోలు కోసం అంతర్జాతీయ సంస్థలకు రుణ దరఖాస్తు పెట్టుకున్న కేంద్రం.. వ్యాక్సినేషన్లో మరింత స్పీడ్ పెంచాలనుకుంటోంది.

First Published:  4 Nov 2021 3:32 AM IST
Next Story